Milk Price increased : ధరల మోత మోగుతోంది. ఒకటీ రెండు అని కాదు అన్నింటి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వంట నూనెల దగ్గరి నుండి గ్యాస్ సహా ప్రతి ఒక్కింటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుడిపై ధరల భారం మోపుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరాయి పాల ధరలు.
సామాన్యుడిపై మరో భారం పడనుంది. విజయ పాల ధర లీటరుపై రూ.2 చొప్పున పెరగనుంది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలవుతాయని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ వెల్లడించింది. టోన్డ్ పాలు లీటరు ప్రస్తుతం రూ.49 ఉండగా రూ.51కి పెంచింది ప్రభుత్వం. ఆవు పాలు లీటర్ రూ.50 నుంచి రూ.52కు పెరగనుంది. డబుల్ టోన్డ్ పాలు లీటర్ రూ.46 నుంచి రూ.48 .. హోల్ మిల్క్ రూ.66 నుంచి రూ.68 రూపాయలు కానుంది.
కొన్ని రోజులుగా ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్నడూ లేని రీతిలో దినదినం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అందరిపై భారం మోపుతున్నాయి. లీటరు పెట్రోల్ ధర హైదరాబాద్ లో 120 రూపాయలు ఉండగా.. కాస్త అటు ఇటుగా డీజిల్ రేటు ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలను సంస్థలు పెంచుకుంటూనే వస్తున్నాయి. గత కొన్ని రోజుల్లో పెట్రోల్ రేట్లుఎన్నడు లేనంతగా పెరిగాయి.
గ్యాస్ ధరలూ ఈ మధ్య కాలంలో చాలానే పెరిగాయి. గృహావసరాల సిలిండర్ ధర వెయ్యి దాటింది. ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడం ఇతర రంగాలపై ప్రభావం చూపుతోంది. ఆర్టీసీ బస్సు టికెట్ల ఛార్జీలు ఈమధ్యకాలంలో రెండు, మూడు సార్లు పెరిగాయి. డీజిల్ సెస్, టోల్ ఛార్జీ, రౌండప్ ఛార్జీలు అంటూ రూ. 10 నుండి 20 రూపాయల వరకు పెంచారు.
Read Also : Srireddy : పీతల కూర చేసిన హాట్ స్టార్.. శ్రీరెడ్డి వంటకం మాములుగా ఉండదు.. వీడియో చూశారా?