Lord Shani Dev : శని దేవుడిని శనివారం ఎక్కువగా పూజిస్తుంటారు. శని దేవుడిని ఆరాధించడం ద్వారా శని దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు. తెలిసో తెలియకో చాలామంది కొన్ని పనులు చేస్తుంటారు, అలా చేస్తే శనిదేవుని వక్ర దృష్టి వారిపై పడుతుందని తెలియదు. వ్యక్తి చేసే పొరపాట్లు, తప్పుడు పనులు, వారి ప్రవర్తన కారణంగా శని దేవుడు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. శని దేవుడు మీపై కోపంగా ఉన్నారో లేదో కొన్ని సంకేతాలను బట్టి తెలుసుకోవచ్చు. మీరు ఏ పని చేసినా అది క్షీణించడం మొదలవుతుంది.
మీరు అబద్ధాలు ఎక్కువగా చెప్పినప్పుడు.. అప్పుడు మీ ఆరోగ్యం క్షీణించడం మొదలువుతుంది. ఉన్నట్టుండి మీరు ఏదో కోర్టు కేసు విషయాల్లో వివాదాల్లో చిక్కుకుపోతారు జాగ్రత్త.. అలాగే మనసులో ఎప్పుడూ అశాంతి నెలకొని ఉంటుంది. ఏదో అలజడిగా అనిపిస్తుంటుంది. అకస్మాత్తుగా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతారని గ్రహించండి. ఏయే పనుల వల్ల శనిదేవుడికి కోపం వస్తుందో తెలుసుకుందాం.. మద్యం, జూదం వంటి చెడు వ్యసనాలకు అలవాటుపడినప్పుడు, ఇతరులను మోసం చేయాలనే భావన కలిగినప్పుడు, ఇతరులను ద్వేషించడంతో పాటు దొంగతనం చేసినప్పుడు, శుభ్రపరిచే సిబ్బంది, సేవకులు లేదా మీ కింది ఉద్యోగులతో అమర్యాదగా ప్రవర్తించడం ద్వారా మీపై శనిదేవుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
తల్లిదండ్రులు, పెద్దలను అగౌరవపరచడం ద్వారా కూడా శని ఆగ్రహం చెందుతాడు. వేరొకరి హక్కును లేదా భాగస్వామ్యాన్ని తొలగించినప్పుడు, వ్యాధిగ్రస్తులకు, నిస్సహాయులకు సాయం చేయకుండా ప్రవర్తినించినప్పుడు కూడా శని వక్ర దృష్టికి గురవుతారు. ఇళ్లను ఎప్పుడు మురికిగా ఉంచుకునేవారికి, సకాలంలో శుభ్రం చేయకపోయినా కూడా వక్రదృష్టికి గురవుతారు. జంతువులను కుక్కలను చంపి వేధించే వారి పట్ల శని దేవుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. వ్యభిచారం చేసే మహిళల పట్ల తప్పుడు వైఖరి కలిగి ఉండేవారిపై, దేవళ్లు,దేవతలను దూషించే వారిపై కూడా శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు.
Read Also : Shani Dev Effect: ఏలినాటి శని దోషం అంటే ఏమిటి..ఈ దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి?