karthika Deepam Serial Trp: తెలుగు నాట బుల్లి తెర మీద కార్తీక దీపం సీరియల్ కు ఉన్నంత క్రేజ్ మరే సీరియల్ కు లేదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతలా ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. స్టార్ హీరో సినిమా వచ్చినా, క్రికెట్ మ్యాచ్ వచ్చినా మరేది వచ్చినా కానీ కార్తీక దీపం సీరియల్ రేటింగ్ మాత్రం తగ్గలేదు.
అంతలా ఈ సీరియల్ అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్ గురించి పలు తెలుగు సినిమాల్లో కూడా ప్రస్తావించారంటేనే ఈ సీరియల్ హవా ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా తెలుగు నాట కొత్త రికార్డులను క్రియేట్ చేసిన వంటలక్క ప్రస్తుతం తన రేటింగ్ ను కోల్పోతూ వస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని మేకర్స్ షాక్ లో ఉన్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఇలా జరగడానికి అదే కారణమని చెబుతున్నారు.

అందుకే టీఆర్పీ రేటింగ్ పడిపోతుందట…!
ఈ మధ్య కార్తీకదీపం సీరియల్ మరీ సాగదీస్తున్నారని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. అందువల్లే రేటింగ్ పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉన్న వేరే ప్రోగ్రాములు వచ్చినా సరే 20–21 రేటింగ్ అందుకున్న ఈ సీరియల్ కు ఇప్పుడు అతి కష్టం మీద 14–15 రేటింగ్ వస్తోందట.
మరి ఈ దారుణమైన రేటింగ్ చూసైనా కానీ మేకర్స్ తీరు మార్చుకుంటారో? లేకపోతే సీరియల్ ను అలాగే సాగదీసి మరింత రేటింగ్ పతనం చేసుకుంటారో అనేది వేచి చూడాలి. సీరియల్ కు త్వరగా ముగింపు ఇస్తేనే బాగుంటుందని పలువురు ప్రేక్షకులు కోరుతున్నారు.
Read Also : Siri Shanmukh : సిరి పాపకు పెద్ద పంచ్ వేసిన షణ్ముక్.. నీవేం పెద్ద అందగత్తెవు కాదు అంటూ..