Karte kalyani: సినీ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాల్లో నటించిన దాని కంటే కూడా వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె యూట్యూబర్ శ్రీకాంత్ ను రోడ్డుపై పడేసి కొట్టింది. గుడ్డలూడదీసి మరీ పరుగులు పెట్టిస్తూ… తన్నింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రాగా… ఆమెపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అతడు వీడియోలు తీస్కుంటుంటే మీకేమైందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే శ్రీకాంత్ తనతో అసభ్యంగా మాట్లాడినందుకు, తనను తాకినందుకే కొట్టానని ఆమె వివరించే ప్రయత్నం చేశారు.
అయితే తాజాగా దీనిపై మరోసారి స్పందించారు. తన తమ్ముడు ఇళ్లు షిఫ్టు అవుతుంటే తాను యూసుఫ్ గూడ వెళ్లానని… ఈ క్రమంలోనే అక్కడ తనను ఓ అమ్మాయి కలిసిందని కరాటే కళ్యాణి తెలిపారు. అయితే ఈ అమ్మాయితో వీడియోలు తీసిన శ్రీకాంత్… ఆమె వీడియోలను డిలీట్ చేయమంటే చేయట్లేదని తనతో చెప్పినట్లు వివరించింది. మీరు బెదిరించి ఆ వీడియోలు డిలీట్ చేయించండి అని ఆ అమ్మాయి చెప్తేనే.. శ్రీకాంత్ ఇంటికి వెళ్లినట్లు వెల్లడించింది. అక్కడే అతను తనతో అసభ్యంగా మాట్లాడాడని పేర్కొంది. అందుకే అతనిపై చేయి చేసుకున్నానని వివరించింది. ఇలాంటి వీడియోలు తీస్తూ.. మహిళలను ఇబ్బందులు పెట్టే వారెవరినీ వదలనంటూ స్పష్టం చేసింది.