Vikram vs acharya : లోకేష్ కనకగ రాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను చిరంజీవి నటించిన ఆచార్య సినిమాతో పోల్చి చూస్తున్నారు చాలా మంది. ఇంతకీ ఈ రెండు సినిమాల మధ్య ఉన్న ఈ పోలికలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ లేకుండా నటించారు. ఇక చిరంజీవి ఆచార్య బాక్సాఫీసు వద్ద దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక కమల్ హాసన్ విక్రమ్ మాత్రం పాజిటివ్ టాక్ తో ఓపెన్ అయింది.
కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో సూర్య ప్రత్యేక అతిథి పాత్రలో నటించిన మూవీ విక్రమ్.. ఈ సినిమాలో కమల్ హాసన్ మరోసారి కథానాయిక లేకుండా బాక్సాఫీసును రప్పాడించాడు. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఏ మేరకు కలెక్షన్లను రాబడుతోందో చూడాలి. కానీ చిరంజీవి ఆచార్య సినిమా మాత్రం.. ఫ్లాప్ అయింది. రాబోయే గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోయిన్ లేకుండా నటిస్తున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే చాలా రోజులు ఆగాల్సిందే.
Read Also : Vikram Movie Review : కమల్ ’విక్రమ్‘ సినిమా రివ్యూ అండ్ రేటింగ్? ట్రిపుల్ యాక్షన్..!