Hyper Aadi: హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే ఢీ కార్యక్రమం ద్వారా హైపర్ ఆది చేస్తున్నటువంటి రచ్చ మామూలుగా లేదు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది రవికృష్ణ కాలేజ్ సీనియర్స్ లాగా నటించగా, నవ్య స్వామి పాపీ మాస్టర్ కొత్తగా కాలేజ్ కి చేరిన స్టూడెంట్ లాగా సందడి చేశారు.
ఈ క్రమంలోనే హైపర్ ఆది నవ్య స్వామిని దగ్గరికి పిలిచి కొత్తగా చేరావా ఏ క్లాస్ అని అడుగుతారు. నవ్య స్వామి డిగ్రీ ఫస్టియర్ అని సమాధానం చెప్పగా.. ఓ కాలేజా? అని హైపర్ ఆది అనగా వెంటనే నవ్య స్వామి కాదు స్కూల్ అంటూ తనపై పంచ్ వేస్తుంది.తన వెంట ఉన్న పాపి మాస్టర్ ని చూసి ఎందుకు మీ అత్తను నీకు తోడుగా తెచ్చుకున్నావా అంటూ కామెంట్ చేశాడు. వెంటనే పాపి మాస్టర్ ఇక్కడ మా తాతయ్య ఉంటే చూడటానికి వచ్చాను అంటూ హైపర్ ఆది పై సెటైర్ వేస్తుంది.
ఇక హైపర్ ఆది ఈ సెటైర్ ను రవి కృష్ణ పై తోశాడు. ఏరా నువ్వు వాళ్ల తాతయ్య వా? అంటూ రవి కృష్ణని ప్రశ్నించాడు. ఇకపోతే ఆది నవ్వ స్వామిని వాక్ చేయమని అడిగితే ఆమె ఎంతో సిగ్గుపడుతూ నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. అంతలోనే హైపర్ఆది ఏమైనా పోగొట్టుకున్నావు అంటూ మరోసారి తన పై పంచ్ వేసాడు. ఇలా ప్రతిసారి నవ్య స్వామి పై సెటైర్లు వేస్తూ ఆది అందరిని ఎంతగానో నవ్వించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.