Actress Nandita Swetha : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో ఒకటి.గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తోంది. ప్రతి వారం అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈ కార్యక్రమం వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా కంటెస్టెంట్ లు తమ అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను సందడి చేశారు.
అయితే ఈ ప్రోమోలో భాగంగా జడ్జి నందిత శ్వేతా ఢీ వేదికపైనే వెక్కివెక్కి ఏడుస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా ఈమె వేదికపై కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. నందిత శ్వేత పుట్టినరోజు కావడంతో ఈమెకు ముందుగా అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ యాంకర్ ప్రదీప్ ఒక గిఫ్ట్ అందజేశారు. ఎంతో సంతోషంగా గిఫ్ట్ తీసుకున్న నందిత వేదికపైనే ఆ గిఫ్ట్ ఓపెన్ చేసింది.
ఇలా గిఫ్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న గిఫ్ట్ చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా ఈమె ఉన్నఫలంగా కన్నీళ్లు పెట్టుకోవడంతో షోలో ఉన్న కంటెస్టెంట్ లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముంది అనే విషయాన్ని మాత్రం చూపించలేదు. ఈ క్రమంలోనే నందిత శ్వేత ఎందుకు ఏడ్చింది? ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముందనే విషయంపై ఎంతో ఆతృత నెలకొంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అందులో ఏముంది? నందిత ఏడవడానికి గల కారణం ఏమిటి? అనే విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి.