జేఈఈ మెయిన్ 2022 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే రెండు సార్లు తేదీలు ప్రకటించిన జాతీయ పరీక్షల సంస్థ మరోసారి షెడ్యూల్ ను మార్చింది. ఈ నెల, వచ్చే నెల జరగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను జూన్, జులైలో నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి మే 4 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలను.. జూన్ 20 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. మే 24 నుంచి 29 వరకు జరగాల్సిన రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలను జులై 21 నుంచి 30 వరకు జరిపినట్లు తెలిపింది.
అభ్యర్థుల అభ్యర్థన మేరకే షెడ్యూలు మార్చినట్టు జాతీయ పరీక్షల సంస్థ తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఒక్కోసారి ఉన్నందున విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలతో పాటు, జే ఈఈ అడ్వాన్స్డ్ అర్హత కోసం దేశ వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది జేఈఈ మెయిన్ పరీక్షలు రాయనున్నారు.