...

Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి వల్ల జాతి రత్నాలు కామెడీ షో అట్టర్ ఫ్లాప్ కానుందా… కారణం అదేనా?

Anchor Sreemukhi: తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు.బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి ప్రస్తుతం వెండితెరపై కూడా బిజీ అయ్యారు. అలాగే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి తాజాగా జాతిరత్నాలు అనే కామెడీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

మల్లెమాల వారు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కామెడీ షో ఎంతో అద్భుతమైన విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈటీవీ ప్లస్ లో శ్రీముఖి యాంకర్ గా జాతిరత్నాలు అనే సరికొత్త కామెడీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం ఇతర కార్యక్రమాలు మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవచ్చు చు అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి యాంకర్ శ్రీముఖి మైనస్ గా మారనుందని పలువురి అభిప్రాయం.

Advertisement

సాధారణంగా శ్రీముఖికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ కారణంగా ఈమె షో లో సందడి చేసిన అందరి దృష్టి తన పై వెళ్తుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు కనెక్ట్ కాలేరని, ఈ కార్యక్రమంలో కమెడియన్స్ కామెడీ కన్నా శ్రీముఖి తన యాంకరింగ్ తో డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఈ షో పెద్దగా హిట్ కాకపోవచ్చని పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక మల్లెమాల వారి ప్రొడక్షన్ లో జబర్దస్త్ కార్యక్రమం మొదలైనప్పుడు అనసూయ, రష్మీ పెద్దగా ప్రేక్షకులకు తెలియదు.కనుక ప్రేక్షకులు ఈ కార్యక్రమానికి బాగా కనెక్ట్ అయ్యారు అయితే జాతిరత్నాలు విషయంలో అలా కాదని, ఈ షో శ్రీముఖి వల్లే అట్టర్ ఫ్లాప్ అవుతుందని నెటిజన్ల అభిప్రాయం. మరి ఇన్ని అనుమానాలు నడుమ శ్రీముఖి ఎలా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతుందో తెలియాల్సి ఉంది

Advertisement
Advertisement