Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి తో జగతి తనని ఇంట్లోకి రమ్మని చెప్పారు కదా అని ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జగతి నన్ను ఏ హోదా లో మీ ఇంటికి రమ్మంటున్నావు అని రిషి ని ప్రశ్నిస్తుంది. నిన్ను సార్ అని పిలవడానికి ఇది కాలేజ్ కాదు, అందుకే నువ్వు అని పిలుస్తున్నాను నా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడుగుతుంది జగతి. అప్పుడు రిషీ మాట్లాడుతూ నాకు డాడీ అంటే ఇష్టం డాడీ కి మీరంటే ఇష్టం. మా ఇద్దరి మధ్యలో డాడీ నలిగిపోతున్నారు.
అలా డాడ్ ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అందుకే ఇలా చేశాను అని అంటాడు. కాకుండా డాడీ కోసం నేను ఏమైనా చేస్తాను ఆ ఒక్కటి తప్ప అని అనడంతో అప్పుడు జగతి అమ్మ అని పిలవడం అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత రిషి మీరు డాడీ కి భార్యగా రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటిరోజు ధరణి కిచెన్లో ఉండగా మహేంద్ర జగతి కోసం వెతుకుతూ కిచెన్ వైపు వస్తాడు.
అప్పుడు ఏమైంది చిన్న మావయ్య అని ధరణి అడగడంతో జగతి కనిపించలేదు అని మహేంద్ర అనడంతో ఆ విషయం కాస్త దేవయాని చెవిన పడటంతో ఇంట్లో అందరికీ చెప్పి రచ్చ రచ్చ చేస్తుంది. అప్పుడు దేవయాని జగతి గురించి ఇంట్లో వారికి లేనిపోనివన్నీ మాటలు చెబుతూ తనకి ఇంట్లో ఉండే అర్హత లేదని తనకు అర్థం అయిపోయింది అందుకే నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది మహేంద్ర ఇప్పటికైనా తన దృష్టిలో నీ స్థానం అర్థం చేసుకో అని అనడంతో ఇంతలో జగతి లగేజ్ తీసుకుని ఎంట్రీ ఇస్తుంది.
గుమ్మంలో వసుని, జగతి ని చూసిన దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక జగతి కుడికాలు లోపలి పెట్టి ఇంట్లోకి రావడంతో దేవయాని కుళ్ళుకుంటూ ఉంటుంది. జగతి ఇంట్లోకి రావడం చూసి అందరూ ఆనంద పడతారు. అప్పుడు జగతి మాట్లాడుతూ ఇప్పటి వరకూ వసు కి గురువుగా బాధ్యతలు నెరవేర్చాను.
ఇకపై ఈ ఇంటి కోడలిగా బాధ్యతలు నెరవేరుస్తారు అని అనడంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరొకవైపు వసు,రిషి కోసం కాలేజీలో వెయిట్ చేస్తూ రిషి సార్ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటూ ఆనంద పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి తనకు వసు కి మధ్య దూరం తగ్గిందా అని అనుకుంటూ ఉంటాడు.
ముందు రోజు వసు,రిషి ని హాగ్ చేసుకున్నందుకు సార్ ఏమైనా అనుకొని ఉంటాడా అని అనుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో జగతి ఇంటినుంచి భోజనం తీసుకొని రాగా అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో రిషి అక్కడికి రావడంతో పని లేదా రా రిషి అని పిలవగా మీరు తినండి పెద్దనాన్న అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.