Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, మహేంద్ర,జగతి లను తన ఇంట్లోనే ఉండి పోవడంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్క సారిగా షాక్ అవుతారు.
రిషి తన తండ్రి గురించి ఎమోషనల్ గా మాట్లాడుతూ మహేంద్ర తో పాటు జగతిని కూడా ఇంట్లో ఉండమని చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్క సారిగా షాక్ అవుతారు. కానీ రిషి మాటలకు జగతి మహేంద్ర ఆలోచనలో పడతారు.రిషి తన నిర్ణయమే ఫైనల్ అని మీ నిర్ణయాన్ని రేపటి లోపు చెప్పండి అని రిషి తన తండ్రితో చెబుతాడు.
అప్పుడు దేవయాని కోపంతో ఏంచేస్తున్నావ్ రుచి అనగా తన తండ్రి అంటే తనకు ఇష్టమని ఆయన సంతోషమే నాకు కావాలి అని అనడంతో వసు లోలోపల సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు జగతి ఒంటరిగా నిలుచుని ఆలోచిస్తూ దేవయాని అన్న మాటలను తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది.
ఆ తరువాత గౌతమ్, దేవయానితో మాట్లాడుతూ పెద్దమ్మ ఈ రోజు రిషి చేసిన పనికి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. ఈరోజు మనము గ్రాండ్ గా పార్టీ చేసుకోవాలి అని అనడంతో, అప్పుడు దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఇంతలో అక్కడికి వసు రావడంతో వసు ని చూసిన దేవయాని వెటకారం గా మాట్లాడుతుంది. అప్పుడు వసు కూడా ఏ మాత్రం తగ్గకుండా దేవయాని కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఇంతలో కిచెన్ లో వాటర్ కోసం వెళ్లగా అక్కడ ధరణి ఏమైనా కావాలా వసు అని అడగడంతో వద్దు మేడం నేను ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది.
ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళి పోతూ ఉండగా రిషి ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా ఇంటికి వెళుతున్నాను సార్ అని అంటుంది. అలా వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత రిషి, వసు ని జగతి వాళ్ళ ఇంటి దగ్గర వదిలి పెట్టడానికి వెళ్తాడు. అప్పుడు కారు దిగి ఇంట్లోకి వెళ్ళబోతున్న వసుధార మళ్లీ వెనక్కి వచ్చి రిషి ని హత్తుకుంటుంది.
వసు తనని హత్తు కోవడంతో రిషి షాక్ తో అలాగే నిలబడిపోతాడు. ఆ తరువాత జగతి, రిషి ని నన్ను ఏ సంబందం తో ఇంట్లోకి రమ్మంటున్నారు అని రిషి ప్రశ్నిస్తుంది. మరొకవైపు జగతి కనిపించకపోవడంతో ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.