బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ షో మొత్తానికి రెండు జంటల మధ్య చిచ్చుపెట్టి పక్కకు తప్పుకుంది. ఇటీవలే సీజన్ 5 పూర్తవగా అందులో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా షణ్ముఖ్, సిరి ల గురించి మాత్రం తెగ వైరల్ అయింది. వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ మామూలుగా లేదు,అది అందరికీ తెలిసిందే. మొదట వీళ్ళు కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కలిసి నటించారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరికీ అవకాశం వచ్చింది. ఇక హౌస్ లోకి వెళ్ళాక వారిద్దరి స్నేహం మరింత బలపరుచుకున్నారు.
కానీ స్నేహం అనే ముసుగు వేసుకొని హగ్గులు,ముద్దులతో గీత దాటేశారు. దీంతో వీరిద్దరూ హౌస్ నుండి బయటకు రాగానే నెగిటివిటీని మోశారు. ఇక వీరిద్దరి మధ్య జరుగుతున్న రొమాన్స్ ను చూసి నాగార్జున గారు తట్టుకోలేక గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ నాగార్జున గారి మాటలను సైతం లెక్కచేయలేదు.
వాస్తవానికి షణ్ముఖ్ మరో సోషల్ మీడియా స్టార్ అయినా దీప్తి సునయన తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇదే బిగ్ బాస్ హౌస్ వేదికగా దీప్తి సునైనా అందరిముందు షణ్ముఖ్ కి ప్రపోజ్ కూడా చేసింది. కానీ సిరి తో అలా ప్రవర్తించడం వల్ల దీప్తి సునైనా ఇటీవలే షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే సిరి కి కూడా బిగ్ బాస్ షో ముందు తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. షో తర్వాత వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
కానీ తాజాగా శ్రీహాన్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. సిరికి బ్రేకప్ చెప్పనున్నట్లు సమాచారం. ఆ కారణమేమిటన్నది కూడా అతనికి తెలుసు. బిగ్ బాస్ షోలో సిరి మితిమీరి ప్రవర్తించడంతో, షో తర్వాత సిరి ని కలవడానికి కూడా శ్రీహాన్ ఇష్టపడలేదని తెలిసింది. కొన్ని రోజుల నుండి శ్రీహాన్, సిరిని దూరం పెడుతున్నట్లు సమాచారం. ఇక తాజాగా తన ఇన్ స్టా లో కూడా సిరి ఫోటోలను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం తమ వెబ్ సిరీస్ కు సంబంధించిన అప్డేట్ తప్ప మిగిలిన సిరి ఫోటోలను అన్నింటిని డిలీట్ చేశాడని తెలిసింది. శ్రీహాన్ కి లోపల ఎంతో ఆవేదన ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. మొత్తానికి సిరి-శ్రీహాన్ ల బ్రేకప్ కు ఇదే మొదటి సంకేతంగా అందరికీ తెలిసిపోయింది.