Samantha : టాలీవుడ్ క్యూట్ కపుల్ గా ఉండే వాళ్లు చైసామ్. ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని టాలీవుడ్ కే చక్కని జంటలా కనిపించే సమంత, నాగ చైతన్య వ్యక్తిగత కారణాలతో గతేడాది అక్టోబర్ 2వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో అప్పటి నుండి వారిద్దరిపై చాలా కామెంట్స్ వచ్చాయి. అటు సమంతను అక్కినేని ఫ్యాన్స్… ఇటు నాగచైతన్యను సమంత ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు.
అప్పటి నుండి వారిద్దరిపై సోషల్ మీడియో ఎప్పుడూ ఏదో ఒక అంశంపై రూమర్స్ నడుస్తూనే వస్తున్నాయి. కొన్నింటికి వారిద్దరూ తమదైన శైలిలో సమాధానం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మరో రూమర్ అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియోల చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా… త్వరలో చైతూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. గత కొన్ని రోజుల నుండి అఖిల్ కు నాగార్జున సంబంధాల కోసం వెతుకుతున్నారు. మంచి సంబంధాల వేటలో తీవ్రంగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చైతూకి కూడా వివాహం చేయాలని భావిస్తున్నారంట టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. చైకి అఖిల్ కు ఒకేసారి పెళ్లి చేద్దాం అనుకున్న నాగార్జున, కానీ అది కుదరలేదు.
అయితే ఇప్పుడు సమంతతో విడిపోయిన చై స్టార్ హీరోయిన్ తో లవ్ లో ఉన్నట్లు సమాచారం. అందువల్ల కింగ్ నాగార్జున ఇద్దరికీ ఒక సారి వివాహం చేద్దామని నిర్ణయించుకున్నారంట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.
Read Also : School Girl Dance : తగ్గేదేలే.. టీచర్ల ముందే సామి.. సామి పాటకు స్టెప్పులతో దుమ్ములేపింది.. వీడియో చూశారా?