Intinti Gruhalakshmi Today Episode Feb 28 : బుల్లితెరపై అశేష ప్రేక్షకాభిమానులను అలరిస్తున్న ఇంటింటి గృహలక్ష్మి ఈ రోజు ఎపిసోడ్ అంతా ఆసక్తిగా సాగనుంది. హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కనిపించకుండా పోయినా తన కొడుకు కోసం తులసీ దీక్షకు దిగుతుంది. ప్లకార్డులను పట్టుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట తులసీ దీక్షకు చేస్తుంటుంది.
అదంతా టీవీలో ప్రసారం కావడంతో లాస్య చూస్తుంది. అంతే.. వెంటనే నందు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి.. తులసీ చూడు ఏంచేస్తుందో.. మన ఇంటి పరువును బజారుకు ఎలా ఈడ్చిందో చూడు అంటూ చెబుతుంది. ఆ మాటలకు కోపంతో ఊగిపోయిన నందు.. మనకు ఏమాత్రం చెప్పకుండా ఇలా తులసీ చేస్తుందా? వెంటనే వెళ్లి వెనక్కి లాక్కుని తీసుకుస్తానంటాడు నందు. ఆ మాటలకు లాస్య.. నువ్వు ఆ పని చేస్తే టీవీల్లో నువ్వు కూడా కనిపిస్తావు.. ఉన్న ఇంటిపరువును మరింత దిగజార్చినట్టు అవుతుందని అంటుంది. ఆ మాటలకు నందు ఆగిపోతాడు.
అంతకుముందు తులసీ దీక్ష చేసే విషయాన్ని లాస్యకు గాయత్రి ఫోన్ చేసి చెబుతుంది. ఆ తర్వాత నందుకు చెప్పడంతో అతడు వెంటనే నాన్నతో మాట్లాడతానని అంటాడు. తులసి సంగతి ఏంటో తేలుస్తానని అంటాడు. ఆ విషయం తెలిస్తే మీ అమ్మనాన్న కూడా వెళ్లి తులసీ పక్కనే వెళ్లి దీక్షలో కూర్చొంటారని లాస్య అంటుంది. మిగిలిదే మనమిద్దరమేనంటుంది లాస్య. ఆ మాటలకు నందు కూల్ అయిపోతాడు. తులసీ దీక్ష విషయాన్ని ఆమె గురించి బాగా తెలిసిన జీకే అనే వ్యక్తి ఎంటర్ అవుతాడు. ప్రతిసారి తులసీ కష్టాల్లో ఉన్పప్పుడు ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంటారు.
అలా తులసీ కష్టాలను తీర్చేస్తుంటారు. ఇప్పుడు కూడా జీకే అనే వ్యక్తి మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. ఈ జీకే ఎవరో కాదు.. గతంలో అక్షర తండ్రి.. తులసీ స్టేషన్ ముందు దీక్ష చేస్తున్నట్టు తెలిసి షాక్ అవుతాడు. తన పీఏ చెప్పిన మాటలు విని వెంటనే టీవీ పెట్టమని అంటాడు. టీవీలో తులసీ దీక్షకు సంబంధించి న్యూస్ చూసి.. అయ్యో ధర్మ దేవతకే కష్టం వచ్చిందని అంటాడు జీకే. అన్యాయం జరిగిందంటూ కమీషనర్‌కు ఫోన్ చేస్తాడు జీకే.. కమిషన్ వెంటనే లైనల్లోకి వచ్చేస్తాడు.. కమిషనర్ గారు బాగున్నారా? అని జీకే అనగా.. కమిషనర్ అయ్యే మీలాంటి వాళ్లు మాకు ఫోన్ చేయడమే ఎక్కువ.. చెప్పండి ఏదైనా పనా? అని అడుగుతాడు. తులసీ దీక్ష గురించి అని అంటారు.
ఏం లేదండీ.. ఆమె కావాలనే న్యూసెన్స్ చేస్తోంది.. పోలీస్ స్టేషన్ ముందు దీక్ష చేస్తుందని అంటాడు కమీషనర్. కమీషనర్ గారూ.. మీరు నాణేన్ని ఒకవైపునే చూస్తున్నారు.. తులసీ ఎలాంటి వారు నాకు తెలుసు.. తప్పు తులసీ వైపు ఉండకపోవచ్చు.. ఒకవేళ మీ డిపార్ట్ మెంట్ వాళ్లవైపు తప్పు ఉండి ఉండొచ్చు అని అంటాడు. తులసి కేవలం తన కొడుక్కి అన్యాయం జరిగిందనే రోడ్డు ఎక్కి ఇలా న్యాయం కోసం పోరాడుతుందని అంటాడు.
తులసి ఫేవర్ చేయాలని నేను ఇప్పుడు మీకు ఫోన్ చేయలేదంటాడు. అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఎవరిది తప్పు అనేది వాస్తవాలను తెలుసుకోవాలని అంటాడు. ఈ కేసును మీరే పర్సనల్ గా టేకఫ్ చేయాలని కోరుతాడు జీకే.. నాపై మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ కేసుని మీరే చూడాలని అంటాడు.. జీకే మాటలకు కన్విన్స్ అయిన కమిషనర్.. మీ మాటలు వింటుంటే తులసీ గొప్పతనం ఏంటో అర్ధం అవుతుందని కమిషనర్ అంటాడు.
అప్పటికే తన అల్లుడు అభి ఏమయ్యాడు అనే విషయం చెప్పకుండా తులసీ దీక్ష చేయడాన్ని గాయత్రీ తప్పుబడుతుంది. తులసీ దీక్ష చేస్తున్న టెంట్ దగ్గరకు చేరుకుంటుంది. ఆమె చేతిలో ప్లకార్డును విసిరిపారేస్తుంది. నా కూతురి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు అంటూ తులసీని నిలదీస్తుంది. నా అల్లుడు రిస్క్ లో ఉంటే.. వియ్యపురాలైన నాకు ఒక్క మాట కూడా చెప్పవంటూ కడిగిపారేస్తుంది గాయత్రి. అభి కనిపించడం లేదనే కంగారులో నీకు చెప్పడం మరిచిపోయానని తులసీ అంటుంది. ఈ దీక్షలతో ఏమి ప్రయోజనం.. అని అంటుంది.
ఆలస్యమైనా ఫలితం తప్పక ఉంటుందని నా నమ్మకమని తులసీ అంటుంది. నీ కడుపున అభి పుట్టడమే పెద్ద తప్పు అంటూ గాయత్రి మండిపడుతుంది. ఇలోగా నా అల్లుడుకి ఏమైనా అయితే ఏం చేస్తావ్.. నీలా గాల్లో దీపాలు పెట్టలేనంటుంది. ఏం చేయడం చేతగాని వాళ్లే ఇలా చేస్తారు.. నేను వెంటనే ఎస్ఐ దగ్గరకు వెళ్లి అభిని ఇప్పుడు బయటకు తీసుకొస్తాను చూడు అంటూ పోలీస్ స్టేషన్ లోపలికి ఆవేశంగా వెళ్తుంది గాయత్రి..
స్టేషన్‌లో ఎస్ఐని అభి ఎక్కడ అని నిలదీస్తుంది. అందుకు ఎస్ఐ వెటకారంగా సమాధానమిస్తాడు. అధికారం చేతులో ఉందిగా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోనేది లేదంటుంది గాయత్రి.. నేను పెద్ద డాక్టర్‌ని నాకు ఉన్న పలుకుబడితో నిన్న ఎక్కడికైనా ట్రాన్స్ ఫర్ చేయిస్తానంటూ బెదిరిస్తుంది. నువ్వు డాక్టర్ అయితే నాకేంటి.. యాక్టర్ అయితే నాకేంటి.. నువ్ ఎంత అరిస్తే నేను అంతకంటే ఎక్కువగా అరవగలనని అంటాడు ఎస్ఐ.. నా అల్లుడిని ఎక్కడ దాచారు అని గాయత్రి అడగడంతో మ్యాట్రిమోనిలో దొరకుతాడు ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ గాయాత్రిని అవమానిస్తాడు. వెళ్లకుండా ఇంతే గొడవ చేస్తే సెల్ లోపల వేస్తానని ఎస్ఐ బెదిరిస్తాడు. ఆ మాటలకు నేనేంటో చూపిస్తాను.. అంటూ గాయత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
వెంటనే తులసీ నేను చెప్పానుగా వదినా.. ఆ ఎస్ఐ మాములుగా వినేవాడు కాదని అంటుంది. అందుకే ఈ దీక్షతోనే ఎస్ఐ మన అభిని తిరిగి బయటకు తీసుకొచ్చేలా చేస్తాననంటుంది తులసీ.. అభిమాని తీసుకొచ్చేందుకు అవసరమైతే కోర్టుకు వెళ్తానని అనడంతో తులసీ.. మన అభి ఎస్ఐ చేతుల్లో ఉన్నాడు.. ఏమైనా చేయచ్చునని అంటుంది. నీ దీక్షలతో ఏమైనా పోలీసు కమిషనర్ దిగొస్తాడా అని అంటుంది గాయత్రి.. అంతలోనే కమిషనర్ ఎంట్రీ ఇస్తాడు. కమీషనర్ కారు స్టేషన్ ముందు ఆగడంతో గాయత్రి నివ్వేరపోతుంది.
మీరు చేస్తున్న దీక్ష చూసి మాట్లాడదామని, మీకు న్యాయం చేద్దామని వచ్చాను తులసీ గారు అని కమిషనర్ అంటాడు. ఆ మాటలకు నేను నా బిడ్డ కోసం తల్లిగా పోరాటం చేస్తున్నాను. ఏంటమ్మా.. న్యాయం కావాలంటావు.. న్యాయం చేస్తానంటే వద్దంటావు అని కమిషర్ అనడంతో నా బిడ్డ కనిపించేంతవరకు ఈ దీక్ష నుంచి కాలు బయటకు అడుగుపెట్టను అంటుంది తులసీ… అభిని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారో జరిగిందంతా కమిషనర్ కు వివరిస్తుంది తులసీ.. నా కొడుకు నిర్దోషి గా నేను నిరూపిస్తా అంటుంది తులసి.
నాతో రా.. ఎస్ఐ ముందే మ్యాటర్ తేల్చేస్తా అంటే.. నేను ఎక్కడికి రాను.. కమిషనర్ గారూ అంటుంది.మీ సెంటిమెంట్‌ని నేను అర్ధం చేసుకున్నాను.. నీకు న్యాయం జరిగేలా చేస్తానని అంటాడు కమీషనర్. ఇంతలో కమిషనర్ కారును చూసి కానిస్టేబుల్ ఆ విషయం ఎస్ఐకి చెబుతాడు. మీరు వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్లి చేసిన తప్పును ఒప్పేసుకోండి.. అంటాడు. ఇగో రవీంద్ర ఇక్కడ.. తగ్గేదేలే అంటాడు.. అభిని ఇక్కడ ఆడుకుందామనుకుంటే ఈ కమిషనర్ వచ్చాడేంటీ.. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడతాడు.. కమిషనర్ లోపలికి వస్తే.. నేను రౌండ్స్ కు వెళ్లినట్టు చెప్పు అంటాడు ఎస్ఐ.. కమిషనర్ వచ్చేలోగా ఎస్ఐ అక్కడి నుంచి పరారు అవుతాడు.
Intinti Gruhalakshmi March 1 Episode (రేపటి ఎపిసోడ్‌లో..)
తరువాయి భాగం.. అభిని ఇంకా ఇబ్బంది పెట్టేందుకు ఎస్ఐ అతన్ని దాచిన ప్రదేశానికి వెళ్తాడు. ఇక అభిని ఎన్ కౌంటర్‌కి చేయాలనుకుంటాడు. ఈ విషయాన్ని కానిస్టేబుల్ తులసీ చెవిలో వేస్తాడు. వెంటనే తులసి కూడా ఆ సీన్‌లో ఎంట్రీ ఇస్తుంది.. అభిని పారిపోమ్మని, వదిలేస్తున్నానని చెబుతాడు. అభి పారిపోతుండగా రివాల్వర్ తో కాలుస్తాడు. ఓ రాయికి తగిలి అభి కిందపడిపోతాడు. ఈ సీన్ లో తులసీ పరుగులు పెడుతూ అభి అనుకుంటూ రావడం కనిపిస్తుంది. కమింగ్ అప్ ఎపిసోడ్‌లో తులసీ ఎస్ఐ బారినుంచి అభిని ఎలా రక్షించుకుంటుంది అనేది చూడాలి.
Read Also : Intinti gruhalakshmi : ఎస్సైపై యుద్ధం ప్రకటించిన తులసి… ఎస్సై ఏం చేయనున్నాడు..?
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
This website uses cookies.