Instagram: ఈ జనరేషన్ వారికి ఇంస్టాగ్రామ్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఇంస్టాగ్రామ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ ను వాడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ యాప్ కు బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పవచ్చు. అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ యాప్ వారు నిత్యం ఏదో ఒక కొత్త అప్డేట్ ని తీసుకువచ్చి ఈ యాప్ ను వాడేవారిలో మరింత ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొక కొత్త ఫీచర్ ని తీసుకు వచ్చే పనిలో పడ్డారు. ఆ కొత్త ఫీచర్ ఏమిటంటే..
మామూలుగా ఇంస్టాగ్రామ్ లో స్టోరీలకు కేవలం టెక్స్ట్ రూపంలో మాత్రమే రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. కానీ తాజాగా తీసుకురానున్న కొత్త ఫీచర్ సహాయంతో ఇంస్టాగ్రామ్ స్టోరీలకు వాయిస్ మెసేజ్, ఫోటోతో రిప్లై ఇవ్వచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నాయి. ఆ ఫీచర్ టెస్టింగ్ కాస్త పూర్తి కాగానే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ ఫీచర్ తో ఇంస్టాగ్రామ్ లో యూజర్ల సంఖ్య మరింత పెరగనుంది అని భావిస్తున్నారు. ఈ ఫీచర్ తో పాటుగా ఇంస్టాగ్రామ్ లో క్యూఆర్ కోడ్ సహాయంతో పోస్ట్ లు షేర్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.
అయితే ఇంతకు ముందు వీటితోపాటు ఇంస్టాగ్రామ్ లో స్టోరీ లకు రిప్లై ఇస్తే గతంలో మెసేజ్ ఇన్ బాక్స్ లో చూపించేవి. కానీ తాజాగా రానున్న కొత్త ఫీచర్ వాయిస్ మెసేజ్, ఫోటో రిప్లై తో ప్రైవేట్ స్టోరీ లైక్ ఫీచర్ ఇకపై ఉండదని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ఇంస్టాగ్రామ్ యూజర్ల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరగనుంది. ఈ ఇంస్టాగ్రామ్ యాప్ ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని ఫాలో అవుతున్నారు. మరీ ముఖ్యంగా అయితే యువత ఎక్కువగా ఈ ఆప్ కు అట్రాక్ట్ అవుతున్నారు.