Astrology: రాహువు అనుగ్రహం ఉంటే అన్నీ ప్రయోజనాలే.. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు

Astrology: గ్రహాలు మనుషులపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. కొన్ని గ్రహాలు కొందరికి ఎంతో మంచిని చేస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందేలా చేస్తాయి. కొందరికి మాత్రం వ్యతిరేక ప్రభావం ఉంటుంది. చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాహువు అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి వచ్చే ఏడాది వరకు మంచి జరుగుతుందట. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.

గ్రహాల పరివర్తనం వల్ల 12 రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో రాహు గ్రహం వాటాలు, ప్రయాణాలు, విదేశా ప్రయాణాలు, అంటు వ్యాధులు, రాజకీయాలు మొదలైన వాటికి కారణంగా ప్రయాణిస్తారు. రాహువు మేష రాశిలో ఉన్నాడు. 2023 వరకు రాహువు మేష రాశిలోనే ఉంటాడు. రాహువు సంచారం వల్ల 3 రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఉంటాయి.

Advertisement

మిథునం రాశి వారు కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి విజయావకాశాలు ఉంటాయి. విదేశాల్లో చదువుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. అలాగే కర్కాటకం రాశి వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లభించవచ్చు. లేదా ఇంక్రిమెంట్ వస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇది మంచి సమయం.

మీనం రాశి వారికి రాహువుతో మంచి లాభాలే ఉన్నాయని పండితులు వెల్లడిస్తున్నారు. ఆకస్మికంగా డబ్బు పొందుతారు. శక్తి, ధైర్యం పెరుగుతుంది. రాజకీయాల్లో కష్టపడితే విజయం సొంతం అవుతుంది. షేర్ మార్కెట్ లో, లాటరీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం.

Advertisement
Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub Editor – Tufan9 Telugu

నేను వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 2016లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలో అడుగుపెట్టాను. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటాను.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel