House warming: మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం గృహ ప్రవేశం చేసే సమయంలో తప్పనిసరిగా ఆ ఇంటి ఆడపడుచు పాలు పొంగించాలి అనే ఆచారం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గృహప్రవేశ సమయంలో తన ఆడపడుచు ఎక్కడ ఉన్న ఇంటికి పిలిపించి తన చేత పాలు పొంగించి తనకు బట్టలు పెట్టడం జరుగుతుంది.అయితే ఆడపడుచు ఉన్నవారు తప్పనిసరిగా వారితోనే పాలు పొంగిస్తారు ఒకవేళ ఆడపడుచు లేనివారు ఎవరితో పాలు పొంగించాలి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.
ఈ క్రమంలోనే ఎవరికైతే ఆడపడుచు ఉండరో అలాంటి వారు ఎవరితో పాలు పొంగించాలనే విషయానికి వస్తే.. ఆడపడుచు లేనివారు ఆ ఇంటిలో ఎవరైనా పెద్ద ముత్తయిదువ ఉంటే వారి చేత పాలు పొంగించాలి. అలా కాకుండా చినాన్న పెదనాన్న వరస కూతురు ఆడపడుచు వరుస అయితే అలాంటి వారి చేత కూడా పాలు పొంగించవచ్చు. ఇక ఇంట్లో కానీ మన బంధువులలో కానీ మనకి ఆడపడుచు వరసయ్యే వారు ఎవరూ లేకపోతే మన చుట్టుపక్కల మనకు వరస అయ్యే వారి చేత పాలు పొంగించినా అంతా శుభమే కలుగుతుంది.
ఇక గృహప్రవేశం చేసిన సమయంలో ఈ విధంగా పాలు పొంగించడానికి ఆడపడుచు లేకపోతే ఆ ఇంటి పెద్ద ముత్తయదువు లేదా వరుసకు ఆడపడుచు అయ్యే వారి చేత పాలు పొంగించడం ఎంతో మంచిది. ఎవరైతే ఇంటిలో పాలు పొంగించి ఉంటారో అలాంటి వారికి తప్పనిసరిగా చీర పెట్టడం ఎంతో శుభం.ఇలా చీర పెట్టి పంపించడం వల్ల తను సంతోషంగా వెళ్లడంతో మన ఇంటిల్లిపాది కూడా ఎంతో సంతోషంగా ఉంటాము. అందుకే గృహప్రవేశ సమయంలో ఇంటి ఆడబిడ్డలను పిలిచి తప్పనిసరిగా వారికి వడి బియ్యం లేదా కొత్త బట్టలు పెట్టి పంపించాలి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World