Guppedantha Manasu: సూపర్‌ ట్విస్ట్‌… మీరే నా ప్రాబ్లం సర్‌ అని క్లాస్‌ అందరి ముందు రిషీ చెప్పిన వసూ…?

guppedantha manasu serial latest episode
guppedantha manasu

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమౌతున్న సీరియల్ గుప్పెడంత మనసు. మరి ఈ సీరియల్‌లోని రిషీ వసూ క్యారెక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తెలుగులోగిళ్లలోని ఆడపడుచులందరికీ ఈ పేర్లు సుపరిచితమే. ఇక ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ హైలెట్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.

guppedantha manasu serial latest episode

Advertisement

రిషి వసూలు షార్ట్ ఫిలిం సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ అయినందుకు తమ సంతోషాల్ని మహేంద్ర జగతిలతో పంచుకుంటారు. ఇక రిషీ మహేంద్రల దగ్గరకు వచ్చి ఫణీంద్ర ప్రివ్యూ ఎప్పుడో చెప్తే మినిస్టర్ గారిని పిలుద్దాం అంటాడు. రిషి ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంది అది అయిపోగానే పిలుద్దాం అంటాడు. ధరణి ఏంటి రిషీ తెగ సంతోషంగా కనిపిస్తున్నాడు అని దేవయాని అడుగుతుంది. కాలేజ్ విషయం అత్తయ్య గారు మనకు సంబంధం లేదులే అంటుంది ధరణి. దానికి దేవయాని ఎందుకు సంబంధం లేదు కాలేజ్ మనదే కదా అని తిట్టి ధరణిని పంపిస్తుంది.

ఇక వసుధార నిద్రపోకుండా రిషి తనతో తీసుకున్న ఫొటోలను చూస్తూ ఉంటుంది. రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలాగే రిషీ కూడా వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రిషి మెసేజ్ చేయాలా వద్దా అనుకుంటూ హలో అని మెసేజ్ చేస్తాడు రిషి నుంచి మెసేజ్ రావడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది వసుధార. మీకు షార్ట్ ఫిలిం నచ్చిందా సార్ అని అడుగుతుంది అవును నేను నీకు థాంక్స్ కాదు స్పెషల్ థాంక్స్ చెప్తాను అంటాడు రిషీ. వసుధార గతంలో స్పెషల్ థాంక్స్ అంటూ రిషి తనని కౌగిలించుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. వసుధర నాకు స్పెషల్ థాంక్స్‌ వద్దు సార్ అంటుంది. రిషి షార్ట్ ఫిలిం పూర్తయ్యాక దాని గురించి మాట్లాడదాం అంటాడు.

Advertisement

ఇక రిషి కాలేజీకి వస్తాడు రిషి కార్ సౌండ్ వినే.. వచ్చింది రిషి సార్ అని కనిపెడుతుంది వసూ. రిషి మాత్రం వసుధారాను చూసి కూడా ముందుగా తానే పలకరించాలి అని వెళ్ళిపోతాడు. వసుధారా మాత్రం ఏంటి రిషి సార్ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నాడు అని ఆలోచిస్తూ నిలబడిపోతుంది. ఇక రిషి ఏంటి పలకరించలేదు అంటూ వెనక్కి తిరిగి వసు అంటు పిలుస్తుండగా, వసుధారా సార్ అంటూ ఒకేసారి చూసుకుంటారు. అంతలో గౌతమ్ అక్కడికి వచ్చి తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. రిషి, వసుధరను క్లాస్‌కి వెళ్ళు అని పంపిచేస్తాడు. దాంతో గౌతమ్ ఎందుకు వసుధరను పంపించావ్ అంటూ కోప్పడతాడు. రిషి క్లాస్ చెప్పడానికి వసుధార నోట్ బుక్‌ని తీసుకుంటాడు. వసుధార డల్‌గా కనిపించడంతో ఏమైంది..?, ఏంటి ప్రాబ్లం..? అని అడుగుతాడు. వసుధర మీరే నా ప్రాబ్లం సార్ అంటుంది. మరి వసూ ఎందుకలా అనిందో తెలుసుకోవాలంటే తరువాత ఎపిసోడ్ చూడాల్సిందే.

Advertisement