Intinti Gruhalakshmi : పార్టీలో లాస్యకు ఘోర అవమానం.. తులసిపై శపథం చేసిన లాస్య..?

Intinti Gruhalakshmi April 4th Today Episode :
Intinti Gruhalakshmi April 4th Today Episode :

Intinti Gruhalakshmi April 4th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంట్లో నుంచి కోపంతో వెళ్ళిపోతారు లాస్య నందు.వేరే ఇంటికి చేరిన తర్వాత లాస్య ఆనంద పడుతూ ఉంటుంది. అప్పుడు నందు మగాడి తోడు లేకపోతే ఈ సమాజంలో బతకడం ఎంత కష్టమో తులసికి తెలిసి వస్తుంది. అంతేకాకుండా తులసికి పిల్లల చదువు పెళ్లిళ్ల సమయంలో తండ్రి పక్కన లేకపోతే ఏ విధంగా ఆ పరిస్థితులలో ఎదుర్కొంటుందో నేను కూడా చూస్తాను అని లాస్య తో అంటాడు.

అప్పుడు లాస్య నువ్వేం టెన్షన్ పడకు నందు శశికళ అప్పు తీర్చలేక రోడ్డున పడుతుంది. మీ అమ్మ నాన్న కూడా మన దగ్గరికి వస్తారు చూడు అని చెబుతుంది. మరొకవైపు తులసి ఇంటికి జీకే వస్తాడు. తులసి యోగక్షేమాలు అడుగుతూ తులసి మంచితనం గురించి గొప్పగా పొగుడుతాడు.

Advertisement
Intinti Gruhalakshmi April 4th Today Episode :
Intinti Gruhalakshmi April 4th Today Episode :

అనంతరం నందు గురించి మాట్లాడుతూ నన్ను ఏమైనా మారాడా అని అడగగా లేదు ఇల్లు మారాడు అని చెబుతుంది తులసి. ఆ తర్వాత జీకే తులసికి ఒక శుభవార్త చెబుతాడు. అక్షర పెళ్లి అనుకోకుండా అయిపోయిందని, పెళ్లికి ఎవరిని పిలవలేదని కానీ ఈ మాత్రం అందరూ తప్పకుండా రావాలి అని ఆహ్వానిస్తాడు. అందుకు తులసి కూడా సరే అని చెబుతుంది.
మరొకవైపు అక్షర శృతి కి ఫోన్ చేస్తుంది. అప్పుడు శృతి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడగగా నేను ఈ సవతిని అని అనడంతో శృతి కోపంతో అక్షరను తిడుతుంది. ఎవరు నువ్వు చెప్పు అని సీరియస్ గా అడగగా, మెడలో తాళి కట్టబోతున్న వాడిని ట్విస్ట్ ఇచ్చి మరి నీకు మొగుడిని చేసుకున్నావు అని అనడంతో అక్షరని గుర్తుపడుతుంది శృతి.

అప్పుడు అక్షర తనకు పెళ్లి అయిందని రేపు రిసెప్షన్ నువ్వు, ప్రేమ్ తప్పకుండా రావాలి అని చెబుతుంది అక్షర. ఈ క్రమంలోనే అక్షర రిసెప్షన్ కి తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇస్తాడు. ఇక మరొకవైపు అక్షర రిసెప్షన్ కి నందు లాస్య కూడా ఆహ్వానం అందడంతో ఫంక్షన్ కి వెళ్లడానికి ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు. అక్షర ఫంక్షన్ కి దేవత, ఎన్నెన్నో జన్మల బంధం, జానకి కలగనలేదు సీరియల్ లోని సెలబ్రిటీలు అందరూ వస్తారు.

Advertisement

ఇంతలో అక్కడికి రావడంతో శ్రుతి ని చూసి ముఖం మార్చుకుంటుంది తులసి. అక్కడినుంచి తులసి వెళ్ళిపోతుండగా ఇంతలో శృతి తులసి వెనకాలే వెళ్లి తులసి నిలదీస్తుంది. అప్పుడు తులసి నానా రకాలు మాటలు అని శృతి ని బాధ పెడుతుంది. లాస్య నందు లు రావడం చూసిన తులసి ఎలా అయినా ఫంక్షన్ నుంచి వెళ్లిపోవాలి అని అనుకుంటూ వెళ్తూ ఉండగా కరెక్ట్ గా లాస్య ఎదురు పడుతుంది.

దీంతో వారిద్దరి మధ్య రచ్చ మొదలవుతుంది. ఇక ఆ ఫంక్షన్ లో తాగుబోతు రమేష్ లాస్య ని గోరంగా అవమానిస్తాడు. అప్పుడు లాస్య ఆ కోపం అంతా తులసిపై చూపిస్తూ నిన్ను నీ ఫ్యామిలీ ని విడగొడతాను అంటూ తులసి ఫై శపధం చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Guppedantha Manasu : దేవయానికి స్వీటుగా వార్నింగ్ ఇచ్చిన వసు.. ప్రేమలో పడిన వసు, రిషి..?

Advertisement