Mahesh babu glamour secret: సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెల్లగా ఉంటూనే చాక్లెట్ అంత స్వీట్ గా ఉండే ఆయన అందంతో అందరినీ అలరిస్తుంటారు. నాలుగ పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ… సినిమా సినిమాకి లుక్ ను మార్చేస్తుండే ఆయన గ్లామర్ వెనుక సీక్రెట్ ఏంటో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా మిల్క్ బాయ్ మాహేశ్ అంత హ్యాండ్ సమ్ గా కనిపించడం వెనుక రహస్యాన్ని ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ లు బయట పెట్టారు.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఇటీవలే నటించిన సర్కారు వారి పాట సినిమా ఈనెల 12వ తేదీన విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి ఫైట్ మాస్ట్ గా పని చేసిన రామ్, లక్ష్మణ్ లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మహేష్ బాబు సీక్రెట్ ను రివీల్ చేశారు. మహేష్ అంత అందంగా, కూల్ గా, ఛార్మింగ్ గా కనిపించడానికి కారణం రోజూ ధ్యానం చేయడమేనని వివరించారు. ఆయన రోజూ మూన్ ధ్యానం చేస్తారని తెలిపారు. అలాగే యోగా, వర్కవుట్స్ కూడా చేస్తుంటారన్నారు. అందువల్లే ఆయన అంత అందంగా ఉన్నాడని స్పష్టం చేశారు.