Bappi Lahari : ప్రముఖ సంగీత దర్శకుడు,గాయకుడు బప్పీ లహరి మరణించారు. ఈ రోజు ఉదయం ముంబయ్ లోని ఓప్రైవేట్ హస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచారు. 69 ఏళ్ల వయస్సులో అనారోగ్య కారణాలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి చెందినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో పాటలను కంపోజ్ చేసి… పాడి తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్నారు బప్పీ లహరి. 2020 లో వచ్చిన బాఘీ3కి ఆయన చివరిసారిగా పనిచేశారు. బప్పి లహిరిగాా ప్రసిద్ధి చెందిన అలోకేష్ లాహిరి భారతీయ చలనచిత్రంలో సింథసైజ్డ్ డిస్కో సంగీతాన్ని ఉపయోగించడాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు.
బప్పి లహిరి 1970-80 చివరలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి అనేక చిత్రాలలో సూపర్ పాటలను అందించారు. 2020లో శ్రద్దా కపూర్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బాఘీ 3లో భంకాస్ పాట చివరిగా ఆలపించారు. తెలుగులో బప్పి లహిరి సింహాసనం సినిమాకు సంగీతం అందించాడు.. ఆ తర్వాత స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు.
1952 నవంబర్ 27న కోల్‌కతాలో జన్మించిన బప్పి లాహిరి తన విభిన్న శైలి కారణంగా చిత్ర పరిశ్రమలో విభిన్నమైన గుర్తింపును తెచ్చుకున్నారు. నిత్యం బంగారు ఆభరణాలతో ఉండే సంగీత విద్వాంసుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో హిట్ పాటలు పాడారు. బప్పి లహిరి మొదటి సూపర్ హిట్ చిత్రం అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ నటించిన జఖ్మీ సినిమా. గతేడాది కరోనా సోకడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి చికిత్స తీసుకున్నారు బప్పి లహిరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World