Gayatri mantra : గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడి నుంచి ఉఫశమనం లభిస్తుంది. అందకే చాలా మంది గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుంటారు. అయితే గాయత్రీ మంత్రాన్ని సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, సూర్యాస్తమయ సమయంలో చదవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దుఃఖం, బాధలు, దరిద్రం, పాపాన్ని పోగొట్టడంలో గాయత్రీ మాత ముందుంటుంది. ఆమెను కటాక్షం పొందాలంటే గాయత్రీ మంత్రం చదవాల్సిందే. అలాగే సంతానం కోసం, పనిలో విజయం కోసం, జ్ఞాపక శక్తి పెరిగేందుకు, పితృ దోషం, కాల సర్ప దోషం, రాహు-కేతు, శని దోషాల నుంచి విముక్తి కోసం గాయత్రీ మంత్రాన్ని పఠించాలి.
గాయత్రీ మంత్రం.. ఓం భూర్భవః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధ్యో యో నః ప్రచోదయాత్..
గాయంత్రీ మంత్రం అర్థం..
ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.
భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).
భువః = చిత్ స్వరూపుడు (జ్ఞాన రూపుడు).
స్వః = ఆనంద స్వరూపుడు (దుఃఖరహితుడు).
తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేశ్వరుడు.
సవితుః = ఈ సృష్టి కర్త.
వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.
భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).
దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.
ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)
యః = ఆ పరమేశ్వరుడు.
నః ద్యః = మా బుద్ధులను.
ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.
Read Also : Kubera Dhana Mantra : ఇంట్లో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే ఈ ఒక్క మంత్రం పఠిస్తే చాలు..!