Intinti Gruhalakshmi March 10 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రేమ్, శృతి ల కోసం దివ్య అన్నం తినకుండా పస్తులు ఉంటుంది. అప్పుడు తులసి అర్థం చేసుకో దివ్య కొన్ని రోజులు ప్రేమ అన్నయ్యని మరిచిపో.. వాడు శిక్ష అనుభవిస్తున్నాడు అని అనగా.. వాడు కాదు నువ్వు కన్న కొడుకు నీ కళ్ళ ముందు నుంచి కనపడకుండా పంపడం శిక్ష అని అనరు మామ్ శాడిజం అని అంటాడు ఉంటుంది దివ్య.
నేను అమ్మని రా.. అమ్మని అవమానిస్తావా అని తులసి అనగా.. అలాంటి పరిస్థితుల్లో నువ్వే తీసుకు వచ్చావు అని అంటుంది దివ్య. నీ మీద అన్నయ్య కు ఎంత ప్రేమ ఉందో తెలిసి కూడా అన్నయ్య ను బయటకు పంపావు. డాడ్ అన్న మాటలు నిజం అనిపిస్తుంది. నీ స్వార్థం కోసం దేనికైనా తెగిస్తావ్, నీ స్వార్థం కోసమే చేస్తున్నావు కదా అని దివ్య అనగా.. బాధతో అవును అని అంటుంది తులసి.
ఇక తినమని బ్రతిమలాడి గా ప్రేమ్ అన్నయ్య వచ్చే వరకు నేను తినను అని అంటుంది దివ్య. అప్పుడు తులసి బలవంతంగా తినిపించడానికి ప్రయత్నించగా దివ్య ప్లేట్ ని విసిరి కొడుతుంది. అప్పుడు కోపంతో తులసి తినే అన్నాన్ని ఇలా నేలకేసి కొడితే నేను ఒప్పుకోను. మొత్తం క్లీన్ చేసి కిచెన్ లో పెట్టు కడుపు మాడి నువ్వే తింటావా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది.
మరొకవైపు అద్దె ఇంట్లోకి ప్రవేశించిన శృతి, ప్రేమ్ లు కాస్త ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ప్రేమ్ కి అభి ఫోన్ చేసి డబ్బులు పంపిస్తాను ఖర్చులకు ఉంచుకో అని అనగా సరే అని అంటాడు. కొద్దిసేపు తులసి గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత శృతి, అంకిత లు మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నాము అన్న విషయాన్ని మీరు మాట్లాడిన విషయాన్ని అమ్మకు తెలియకూడదు అని అంటాడు ప్రేమ్.
Intinti Gruhalakshmi March 10 Today Episode : దివ్య కిందిపడిపోవడంతో తులసి షాక్..
మరోవైపు భోజనం చేయక పోవడంతో దివ్య కళ్ళు తిరిగి కింద పడి పోతుంది. ఇక లాస్య ఇంట్లో వాళ్ళు అందరు నన్నే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు అని అనగా నందు బాధపడతాడు. ఇక నందు దివ్య కోసం తులసి దగ్గరకు వచ్చి దివ్య కోసం అయినా ప్రేమే పిలిపించు అని అంటారు.
అప్పుడు తులసి ప్రేమని పిలిపిస్తాను కానీ ఒక్క షరతు.. వారి ఇంటికి వచ్చిన తర్వాత వాడి తో గొడవ పడరు అని నాకు మాట ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు మందు తులసికి మాట ఇస్తాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Intinti Gruhalakshmi: నందు పై విరుచుకుపడ్డ అనసూయ.. బాధతో కుమిలిపోతున్న తులసి…?