Suma Kanakala : సుమ కనకాల ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ఏ చానల్ పెట్టిన మనకు ఏదో ఒక కార్యక్రమం ద్వారా సుమ సందడి చేస్తుంటారు. ఏ సినిమా ఫంక్షన్ జరిగిన ఏ అవార్డు ఫంక్షన్ జరిగిన అక్కడ తప్పనిసరిగా సుమా ఉండాల్సిందే. ఇలా ఇండస్ట్రీలో ఈమె ఎంతో క్రేజ్ ఏర్పరచుకున్నారు. చివరికి హీరోలు సైతం సినిమా ఈవెంట్ కోసం సుమా గారి కోసం ఎదురు చూసే రేంజ్ కి సుమ ఎదిగిపోయారు. ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ తాజాగా జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా మే 6వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సుమ పలు బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ సినిమా ప్రమోట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి సుమ హాజరయ్యి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి వెల్లడించారు.

Anchor Suma Kanakala
ఈ సందర్భంగా అలీ గతంలో సుమ తన భర్త రాజీవ్ తో గొడవలు జరిగాయని వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు సుమ, రాజీవ్ ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే ఈ విడాకుల గురించి అలీ సుమను ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు సుమ సమాధానం చెబుతూ విడాకులు అనేవి భార్యాభర్తలకు ఎంతో సులభమైనవి.. కానీ పిల్లలకు కష్టమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుమ విడాకుల గురించి తన భర్తతో జరిగిన గొడవలు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి.
Read Also : Anchor Suma : అదిరిపోయిన జయమ్మ పంచాయతీ ట్రైలర్… సుమ నటన మామూలుగా లేదుగా!