Hero rajashekar: తెలుగు సినీ రంగంలో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీసు వద్ద పెద్ద హిట్ కాలేదు. అయితే రాజశేఖర్ తాజాగా నటించిన శేఖర్ సినిమా ఈనెల 20వ తేదీన విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు జీవితా రాజశేఖర్ యే దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా హిట్టు అవుతుందో లేదో తెల్సుకోవాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. అయితే రాజశేఖర్ ముక్కు సూటి తనం వల్ల తనకు ఇండస్ట్రీలో శత్రువులు పెరిగిపోతున్నారని చాలా మంది భావిస్తారు. అయితే ఆయన డాక్టర్ చదువు చదివి యాక్టర్ అయ్యారనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాగే ఆయన ఎంతో మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం కూడా అందించారు.
ప్రముఖ టాలీవుడ్ హీరో, కమెడియన్ లలో ఒకరైన సునీల్ కూతురు ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురి కాగా… ఆ సమయంలో రాజశేఖర్ యే ఆ పాపకు వైద్యం చేసి బతికించారని సమాచారం. ఒఖ సందర్భంలో సునీల్ మాట్లాడుతూ… ఈ విషయాలను వెల్లడించారు. ఈ విషయం తెలిసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే మరో వైపు వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని చెబుతున్నారు.