Pushpa-2 movie updates : పుష్ప పార్ట్ వన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని తొలి భాగాన్న మించేలా తీయాలని డైరెక్టర్ సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే కథలో మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కొత్త అప్ డేట్ గురించి వినిపిస్తోంది. పుష్ప పార్ట్ 2 సినిమాలో భన్వర్ సింగ్ పాత్రతో పాటు మరో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా ఉండబోతోందట. అయితే ఈ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి నటించబోతున్నారని తెలిసింది.
Pushpa-2 movie updates
ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇప్పటికే సునీల్ శెట్టి పలు దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ నటించిన గనిలోనూ ఆయన బాక్సర్ గా కనిపించి ఆకట్టుకున్నారు. మరి సునీల్ శెట్టి పుష్ప-2 లో నటంచబోతున్నారా లేదా అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.
Read Also :Pushpa-2 movie : పుష్ప-2 షూటింగ్ ఆలస్యానికి కారణమేంటో తెలుసా?