Pushpa-2 movie : పుష్ప-2 షూటింగ్ ఆలస్యానికి కారణమేంటో తెలుసా?

Pushpa-2 movie : అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తగ్గేదెలే అంటూ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నెన్నో రికార్డులను సాధించింది. అయితే పార్ట్ వన్ అంత పెద్ద హిట్టు కావడంతో.. పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు నమోదవుతున్నాయి. సినిమా షూటింగ్ ఇప్పుడా, అప్పుడా అంటూ ప్రేక్షకులు తెగ వేచి చూస్తున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులుకు బ్యాడ్ న్యూస్ అంటూ పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప-2 సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Pushpa-2 movie
Pushpa-2 movie

డైరెక్టర్ సుకుమార్ యూఎస్ నుంచి నెల రోజుల తర్వాత హైదరాబాద్ రానున్నారట. పుష్ప-2 షూటింగ్ ప్రారంభించేందుకు 3 నుంచి 4 నెలల సమయం తీసుకోవాలని భావిస్తున్నారట. పుష్ప పార్ట్ వన్ కంటే పార్ట్ టూ ను రిచ్ గా చూపించేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారట. అందుకే ఈ ఆలస్యం అంటూ నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తోంది.

Read Also :Puspha Song: స్కర్ట్ ధరించి సామి… సామి అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసిన యువకుడు.. వీడియో వైరల్!

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel