Bigg Boss Non Stop Telugu : తెలుగులో నాన్ స్టాప్ బిగ్ బాస్ ప్రారంభం అయ్యి ఇప్పటికే మూడు సంవత్సరాలు గడించింది. హౌజ్ లో సభ్యులు స్టార్టింగ్ రోజు నుంచే తమ సత్తాను ప్రేక్షకులకు చూపించే పనిలో నిమగ్నం అయ్యి, ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ కొట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. టాస్క్ లలో పాల్గొంటూ, తమ ఇన్నర్ క్యారక్టర్ ను ప్రదర్శిస్తున్నారు.
Bigg Boss Non Stop Telugu
ఇకపోతే షో పాత, కొత్త కంటేస్టెంట్స్ కలయికలో వచ్చిన ఈ నాన్ స్టాప్ షోలో రోజుకో కొత్త విషయం వైరల్ అవుతూ వస్తోంది. ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ లతో ప్రేక్షకులు కూడా ఎంటర్ టైన్ అవుతూ, వాళ్లకు నచ్చిన వాళ్లకు ఓట్ చేస్తూ, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ షో 3 వారాలు పూర్తి చేసుకోగా, నిబంధనలో భాగంగా ఒక్కో వారం ఒక్కో ఇంటి సభ్యుడు ఎలిమినేట్ కావడం తెలిసిన విషయమే.
కాగా గడిచిన మూడు వారాల్లో మొదటి వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవగా, రెండో వారం ఆర్జే చైతూ ఇంటి నుంచి బయటికి వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఇక మూడో వారం అంత కంటే ఆశ్చర్యంగా సరయు ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే నాలుగో వారానికి సంబంధించి తాజా ఎలిమినేషన్ ప్రాసెస్ నిర్వహించగా, పలువురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ ప్రక్రియకు అర్హులుగా నిలిచారు. అందులో యాంకర్ శివ, అరియానా, అషు రెడ్డి, అనిల్ మిశ్రా శర్మ, మహేష్ విట్టా, బింధు మాధవి ఉండగా, నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ నామినేషన్ ప్రక్రియ జరిగే క్రమంలోనే అందరి క్యారెక్టర్స్ బయట పడతాయని టాక్. ఈ సారి కూడా అలాంటి గొడవే జరిగింది. యాంకర్ శివకు, మిత్రా శర్మకు పెద్ద గొడవే అయింది. దాని తర్వాత నటరాజ్ మాస్టర్, తేజస్విని మరియు స్రవంతితో గొడవపడి రచ్చ రచ్చ చేశారు. ఇక వీళ్లు చేసింది తప్పా, ఒప్పా అని, ఎవరిది తప్పు, ఎవరు ఉంటారు, ఎవరూ బ్యాగ్ సర్దుకొని ఇంటి బాట పడతారు అని తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడాల్సిందే.
Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?