Bigg Boss 5 Telugu : తెలుగు తెర మీద ఎన్నో సినిమాల్లో ఉత్తరాది భామలే మెరుస్తూ ఉంటారు. ఈ విషయంలో చాలా మంది ప్రేక్షకులు కూడా అసహనానికి లోనవుతారు. అసలు తెలుగు భామలను హీరోయిన్లుగా దర్శక నిర్మాతలు ఎందుకు ఎంపిక చేయరని ప్రశ్నిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు నాట పుట్టిన ముద్దుగుమ్మలు కూడా హాట్, హాట్ పోజులతో నెట్టింటిని షేక్ చేస్తున్నారు.
ఉత్తరాది భామలకు ఏమాత్రం తీసిపోకుండా స్కిన్ షో చేస్తున్నారు. అంతలా తెలుగు ముద్దుగుమ్మలు దూసుకుపోతుంటే దర్శక నిర్మాతలు మాత్రం ఎక్కువగా ఉత్తరాది భామలనే నమ్ముతారు. వారికే చాన్సులు ఇచ్చి స్టార్ హీరోల పక్కన ఆడిపాడిస్తారు. మన తెలుగు ముద్దుగుమ్మలను వారు ఎందుకు పట్టించుకోరు? ఇదే విషయంపై నటుడు, సీరియల్ యాక్టర్ అయిన నంద కిషోర్ స్పందించారు.
నంద కిషోర్ హీరోగా శ్రీరాజ్ భళ్లా దర్శకత్వంలో జూలై 30 2021న థియేటర్లలో విడుదలైన నరసింహపురం అనే సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ ని హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. కానీ ఈ సినమాను మాత్రం ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ చిత్ర హీరో నంద కిషోర్ సిరిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము ప్రమోషన్ల కోసం పిలిస్తే సిరి రాలేదని ఆరోపించారు.
అంతే కాకుండా తన క్యారెక్టర్ ను తక్కువ చేసి చూపించారని చెప్పిందని వాపోయారు. సిరి వింత ప్రవర్తనతో తమ టీం సభ్యులు విసిగిపోయారని చెప్పుకొచ్చారు. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇస్తే ఇలా చేస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. ట్రైలర్ ను సరిగ్గా కట్ చేయలేదని సిరి ఆరోపించిందని.. ఇది జోక్ అని అన్నారు. ట్రైలర్ కట్ కు సినిమాకు సంబంధం ఉండదనే విషయం కూడా తనకు తెలియదా అని ప్రశ్నించారు.
Read Also : Kothagudem Raja Ravindra: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో కోటి గెల్చిన కొత్తగూడెం పోలీస్..!