Astro Tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దానం చేయడం ద్వారా మనకు పుణ్యం లబిస్తుందని భక్తుల నమ్మకం. జీవితంలో సంతోషంగా ఉండాలంటే… దానం చేయాల్సిందేనని చాలా మంది చెబుతుంటారు. అయితే కొన్ని ప్రత్యేక రోజులు, పండుగ దినాల్లో మరీ ముఖ్యంగా దానం చేసేందుకు ప్రజలు వేచి చూస్తారు. అంతే కాదు జ్యోతిష్య శాస్త్రంలో దాతృత్వం కోసం కొన్ని నియమ, నిబంధనలు కూడా ఉన్నాయి. వీటిని అనుసరిస్తూ.. దానం చేయడం వల్ల జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కష్టాలను అధిగమించొచ్చు.
ధాన ధర్మం గ్రహాలకు సంబంధించిన దోషాలను తొలగించడమే కాకుండా పాపం నుండి విముక్తిని కూడా ఇస్తుందని నమ్మకం. దాన ధర్మం వల్ల ఇహంలో సుఖం, పర లోకంలో మోక్షం కల్గుతుంది. తన సామర్థ్యానికి తగ్గట్టుగా దానం చేయాలని మన పురాణాల్లో చెప్పబడింది. వేసవి కాలంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చని చెప్తున్నారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దాహం వేసిన వారికి నీళ్లు ఇవ్వడం గొప్ప పుణ్యమని అంటారు. వేసవిలో ప్రజలు తరచుగా దాహంతో బాధపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దాహార్తులకు నీరు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. అయితే మీరు వేసవిలో తరచుగా నీటి కేంద్రాలను, చలి వేంద్రాలను ఏర్పాటు చేస్తే.. మీకూ మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది.
అలాగే మామిడి పండ్ల దానం గురించి కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. వేసవిలో మామిడి పండ్లు దానం చేయొచ్చు. మామిడి పండ్లకు సూర్య భగవానుడికి ప్రత్యక్ష సంబంధం ఉందని.. దానిని దానం చేయడం వల్ల సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చని చెప్తారు. అలాగే బెల్లం దానం చేయడం వల్ల వ్యక్తి జాతకంలోని సూర్య బలం బలపడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.
Read Also : Hanuman chalisa: ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. హనుమాన్ చాలీసా చదవాల్సిందే!