...

Uk Tribunal Rules: బట్టతల ఉన్న వారిని ఎగతాళి చేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి..!

Uk Tribunal Rules: ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొనే సమస్య జుట్టు రాలటం. వాతావరణ కాలుష్యం, మంచి పౌష్టికాహారం తీసుకోకపోవటం, కొన్ని జన్యుపరమైన లోపాల కారణంగా జుట్టు రాలే సమస్య వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పురుషులలో ఈ సమస్య కారణంగా అతి చిన్న వయసులోనే బట్టతల వస్తుంది. చాలామంది బట్టతల ఉన్న వారిని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి తెలిస్తే జీవితంలో పొరపాటున కూడా బట్టతల ఉన్న వారిని ఎగతాళి చేయరు.

Advertisement

బట్టతల ఉన్నందువల్ల ఎగతాళి చేయడంతో చాలా మంది మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల వారి మానసిక పరిస్థితి మీద కూడా ప్రభావం పడుతుంది. ఈ విషయానికి సంబంధించి ఇటీవల ఇంగ్లండ్‌కు చెందిన ఎంప్లాయిమెంట్‌ ట్రిబ్యునల్‌ అనూహ్య రీతిలో తీర్పునిచ్చింది. ఒక కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి బట్టతల ఉండటం వల్ల ఆ కంపెనీ సూపర్ వైజర్ తరచు ఆ ఉద్యోగిని ఎగతాళి చేస్తూ ఉండేవాడు. దీంతో మనస్థాపానికి గురైన సదరు ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ వరకు వెళ్ళింది.

Advertisement

ఈ కేసులో భాగంగా బట్టతల ఉన్న వ్యక్తులను కామెంట్స్ చేయటం అనేది అవమానించడం క్రిందకు వస్తాయా? లేక లైంగిక వేధింపుల కిందకి వస్తుందా అనే విషయం గురించి ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ ఇటీవల విచారణ జరిపి తీర్పు ప్రకటించింది. ఇలా ఇలా బట్టతల ఉన్న వారిని తరచూ ఎగతాళి చేయటం వారి మీద కామెంట్స్ చేయటం అనేది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ ప్రకటించింది. అందువల్ల పొరపాటున కూడా బట్టతల ఉన్న వారిని ఎగతాళి చేస్తే ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది.

Advertisement
Advertisement