...

APSRTC Charges Hike : మూడు రూపాయలే అంటూ 15 పెంచేశారుగా..!

ఆంధ్రప్రదేశ్​లో డీజిల్ పెస్ పేరుతో పెంచిన ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలు ప్రయాణికులను ముంచేస్తున్నాయి. డీజిల్‌ ధరల పెంపుదలతో వస్తున్న నష్టాల్ని తగ్గించుకునేందుకు స్వల్పంగా ఛార్జీలు పెంచుతున్నాంటూ.. అందిన కాడికి దోచేస్తున్నారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడికి డీజిల్‌ సెస్‌ రూ.2, భద్రత సెస్‌ రూ.1 కలిపి రూ.3 మాత్రమే పెంచుతున్నామని… చిల్లర సమస్య లేకుండా మొత్తంగా రూ.5 పెంచామని ఆర్టీసీ ఛైర్మన్‌, ఎండీ ప్రకటించారు. కానీ గురువారం నుంచి పెంచిన ఛార్జీలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

Advertisement

Advertisement

పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో తక్కువ దూరాలకు ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. కొందరు ప్రయాణికులకు ఒక్కో టికెట్‌ ధరపై ఏకంగా రూ.15 భారం పడింది. పల్లె వెలుగు, సిటీ బస్సు ప్రయాణికులపైనే అడ్డగోలుగా బాదేశారు. గతంలో రూ.10 ఛార్జీ చెల్లించి ప్రయాణించేవారు ఇపుడు 20 రూపాయలు… 15 రూపాయలు ఉన్న వారికి 30 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తోందట. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఆర్టీసీ బస్సు ఛార్జీలే ఈ రేంజ్ లో ఉంటే… ప్రజలు ఇళ్లను వదిలి ఇంకెక్కడికీ వెళ్లలేరేమో అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement