రాజస్థాన్ జోధ్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఓ ట్రక్కు ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. చురూ నుంచి కారులో దైవ దర్శనానికి వెళ్తుండగా జోధ్‌పుర్- జైపుర్ జాతీయ రహదారి వద్ద బిలాడా సమీపంలో ఈప్రమాదం జరిగింది. అయికే అర్ధ రాత్రి ఒంటి గంట సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ట్రక్కు వెనక భాగాన్ని ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతులు విజయ్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్, మంజూ కన్వర్, ప్రవీణ సింగ్, దర్పన్ సింగ్, మధుకన్వర్ సింగ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో ముగ్గురిలో చైన్ సింగ్ అనే వ్యక్తికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. పవన్ సింగ్, సంజూ కన్వర్ అనే మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జోధ్‌పుర్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.