జబర్దస్త్ షోలో సుమ పాల్గొంది. తను నటించిన జయమ్మ పంచాయితీ సినిమా ప్రమోషన్ కోసం సుమ కనకాల జబర్దస్త్ షోకు వెళ్లింది. జయమ్మ పంచాయితీ చిత్రంలో సుమ ప్రధాన పాత్ర అయిన జయమ్మ పాత్రలో కనిపించనుంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో బిజీగా మారింది ఈ ప్రముఖ యాంకర్. ఈ క్రమంలో ఆమె తెలుగు టీవీ నంబర్ వన్ షో అయిన జబర్దస్త్ కు వచ్చింది. కొత్త సినిమా రిలీజ్ ఏదైనా ఉంటే సుమ రావాల్సిందే. సుమ వచ్చిందంటే ఆ ఈవెంట్ ఏదైనా హిట్ అవ్వాల్సిందే. తన మాటలతో అతిథులను, సెలబ్రిటీలను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది సుమ. మాటకు మాట.. పంచ్ కు పంచ్ ఇవ్వడంలో సుమ తర్వాతే ఎవరైనా. అలాంటి సుమ ఇక జబర్దస్త్ కు వస్తే ఎలా ఉంటుంది. ఆ సందడి మామూలుగా ఉండదు.
అయితే సుమను అటు జబర్దస్త్ టీం వాళ్లు కూడా మామూలుగా ఆడుకోలేదు. ఇద్దరి మధ్య మంచి పోటా పోటీగా సెటైర్ల పంచ్ జరిగింది. రాకెట్ రాఘవ స్కిట్ చేస్తూ.. చిన్నప్పుడు అమ్మ అన్నం తినకపో.. స్టార్ యాంకర్ సుమనూ చూపిస్తూ అన్నం తినిపించేంది అంటూ సెటైర్లు వేశాడు. దానికి సుమ కూడా ఏం తగ్గకుండా పంచ్ వేసింది. తర్వాతి స్కిట్ లో తాగుబోతు రమేష్… సుమ గెటప్ లో కనిపించాడు. ఇక స్టేజ్ పై ఒక్కసారిగా అంతా నవ్వుకున్నారు. జడ్జీ ప్లేసులో కూర్చున్న సుమ సైతం నోనో అంటూ కేకలు వేసింది. తాగుబోతు రమేష్ నా గెటప్ వేసినా కూడా తాగినట్లే ఉందంటూ కామెంట్లు చేసింది.
ఇక తాగుబోతు రమేష్ సుమ రోల్ ప్లే చేస్తూ.. ఫుల్ గా ఆడేసుకున్నాడు. ఈవెంట్లు, ఫ్యామిలీ లైఫ్ అంశాలతో సెటైర్లు వేస్తూ పోయాడు. ఇక సుమ కూడా ఎక్కడా తగ్గలేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా పంచ్ లు వేసింది. మొత్తం మీద ఈ స్కిట్ ను సుమ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసింది.