Anchor suma: విడాకులా.. మాకసలు ఆ ఆలోచనే లేదు.. క్లారిటీ ఇచ్చిన సుమ!

Anchor suma: రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా పాపులారిటీ సంపాదించింది సుమ. బుల్లి తెరపై వచ్చే షోలతో ప్రతి ఇంటికీ చేరింది. తన వాక్చాతుర్యంతో ఎందరిలో తన ఫ్యాన్స్ జాబితాలో చేర్చుకుంది. సుమ అంటే ఒక యాంకర్ మాత్రమే కాదు అంతుకుమించి మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. బుల్లి తెర నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ వస్తోంది. టాలీవుడ్ లో ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా సుమ ఉండాల్సిందే. సుమ కాదంటేనో లేదా డేట్స్ కుదరకనో వేరే వాళ్లు కనిపిస్తారు తప్పితే సుమనే యాంకరింగ్ చేస్తుంటుంది.

Advertisement

మొదట్లో సినిమాలు చేసిన సుమ. తర్వాత సీరియల్స్ చేస్తూ వచ్చింది. తర్వాత యాంకర్ గా స్థిరపడిపోయింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత సుమ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కింది. ఆ సినిమా పేరే జయమ్మ పంచాయితీ. సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న సుమ.. పలు షోలకు వెళ్తూ తన మూవీని ప్రమోషన్ చేస్తోంది. అందులో భాగంగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న సుమ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. విడాకుల రూమర్స్ పైనా స్పందించింది.

తన వైవాహిక జీవితంలో ఎన్నో గొడవలు జరిగాయని చెప్పింది సుమ. చిన్న చిన్న గొడవలు ప్రతి దంపతుల లైఫ్ లో సర్వసాధారణమంది. తామిద్దరం విడాకులు తీసుకున్నట్లు కొన్ని వెబ్ సైట్లు రాశాయని.. కానీ అలాంటిది ఏమీ లేదని తేల్చి చెప్పింది. భార్యభర్తులాగ విడాకులు తీసుకోవడం చాలా సులభమని.. కానీ తల్లిదండ్రులుగా చాలా కష్టమని పేర్కొంది. ఇప్పటి వరకు విడాకుల ఆలోచన లేదని.. ఇకపై కూడా రాదని స్పష్టం చేసింది సుమ.

Advertisement