Chanakya nithi : విజయవంతమైన జీవితం అందుకునేందుకు చాలా మంది ఆచార్య చాణక్యుని విధానాలను అనుసరిస్తుంటారు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అయితే మనం పెంచుకునే కుక్క వద్ద కూడా అనేకమైన మంచి విషయాలు ఉంటాయట. వాటిని చూసి మనం చాలా నేర్చుకోవాలట. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శునకం మాదిరిగా మనుషులు కూడా నిద్రలోనూ అప్రమత్తంగా ఉండాలి. తద్వారా మనిషి అన్ని సందర్భాల్లోనూ నిపుణిడిగా వ్యవహరించగల్గుతాడు. అలాగే మనకు సాయం చేసిన వారికి నమ్మకంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి నమ్మక ద్రోహం చేయకూడదు. అలాగే శునకాలు చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తాయి. తమ యజమానికి ఏదైనా హాని జరిగితే.. అవి అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తాయి. అలాగే మనిషి కూడా ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతున్నారు. శునకానికి ఎలాంటి ఆహారం పెట్టినా అది సంతృప్తిగా తింటుందని… మనిషి కూడా తనకు లభించిన ఆహారంతో సంతృప్తి చెందాలని.. అతిగా ఆశించి అనర్థం తెచ్చుకోవద్దని ఆచార్య చాణక్యుడు తెలిపాడు.
Read Also : Chanakya nithi : ఈ ఐదు విషయాల్లో జాగ్రత్తగా లేకుంటే సర్వం కోల్పోవాల్సిందే.. చూస్కోండి మరి!