Actress Pragathi Comments : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ నటి వెరీ పాపులర్.. ఆమె చేయని క్యారెక్టర్ అంటూ లేదు. అమ్మ, అక్కా, ఆంటీ, వదిన ఇలా అన్ని క్యారెక్టర్స్‌ను అవలీలగా పోషిస్తూ సినీ పరిశ్రమలో తన కంటూ ఓ గుర్తింపును సాధించుకుంది.
కుర్రహీరోలు, పెద్దహీరోలు అనే తేడా లేకుండా దర్శకుడు తనకు ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుంది. అందువల్లే ఇప్పటికీ ఆమె చిత్ర పరిశ్రమలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఇంతకూ ఎవరా నటి అనుకుంటున్నారా..? మీ అందరికీ బాగా పరిచయం ఉన్న యాక్టర్ ‘ప్రగతి’..
ఈ మధ్య కాలంలో నటి ప్రగతి.. ఎఫ్- 2 సినిమాలో విక్టరీ వెంకటేష్‌కు అత్తగారిగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. అయితే, ఆవిడ ఇండస్ట్రీకి రాకముందు, వచ్చిన తొలినాళ్లలో తన జీవితం ఎలా ఉందో ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకుంది.
20 ఏళ్లలోనే పెళ్లి చేసుకుని తాను పెద్ద తప్పు చేశానని, అన్ని తెలిసి వచ్చేసరికి జరగాల్సింది అంతా జరిగిపోయిందని బాధపడింది ప్రగతి.. ఆ తర్వాత మనస్పర్దలు రావడంతో భర్తకు దూరంగా ఉంటున్నట్టు తెలిపింది. అయితే, తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపింది.
కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా.. ఆ తర్వాత సరైన హిట్లు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెట్ అయ్యినట్టు తెలిపింది. ఇక సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన ప్రగతి.. ఒకానొక సందర్భంలో తనను ఒక టాప్ కమెడియన్ క్యారవ్యాన్‌లోకి పిలిచి తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడని పేర్కొంది. చివరగా అతనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో మళ్లీ ఎప్పుడూ తన జోలికి రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. కాగా, ప్రగతి చేసిన ఈ కామెంట్స్‌పై ఆ టాప్ కమెడియన్ ఎవరా అని నెటిజన్లు వెతికే పనిలో పడ్డారట.
Read Also : Tollywood : యంగ్ హీరోయిన్స్‌తో సీనియర్ హీరోస్.. కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world