Actress Poorna Comments : తెలుగు ఇండస్ట్రీలో నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ‘అవును’ సీరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత కూడా తెలుగులో చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఇటీవల కాలంలో పూర్ణ సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది. హీరోయిన్‌గా కనిపించడం మానేసి సైడ్ పాత్రల్లో చేస్తుంది.. అందుకు పూర్ణ బొద్దుగా ఉండటమే అని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. దీంతో ఏమనుకుందో ఏమో ఒక్కసారిగా స్లిమ్ అయ్యి అందరినీ షాక్‌కు గురిచేసింది అందాల నటి పూర్ణ..
తాజాగా ఈ అందాల తార బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ మూవీలో ప్రభుత్వ అధికారి పాత్రలో నటించారు. కాదు కాదు జీవించారని చెప్పుకోవచ్చు. అందం, అభినయంతో సినిమాల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది ఈ తార.. కెరీర్ ప్రారంభంలో యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన ‘అవును’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది పూర్ణ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అవును-2 కూడా చేసింది. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా సీమటపాకయ్ మూవీ చేసిన పూర్ణ భారీ విజయాన్ని అందుకుంది. పూర్ణ కొంచెం బొద్దుగా ఉండటంతో ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గినట్టు తెలిసింది.
అఖండ మూవీలో పూర్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి. సెకండ్ ఆఫ్‌లో బాలయ్య బాబుతో ఆమెకు మంచి సీన్ ఇచ్చారు. ఈ మూవీ విజయం తర్వాత ఆలీతో జాలీగా షోలో పూర్ణ కొన్ని సంచలన విషయాలు చెప్పింది. తాను అవును సినిమాలో చేశాక బాత్రూంలో స్నానం చేయాలంటే భయం వేసేదని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఆ సినిమాలో రవిబాబు దయ్యం రూపంలో వచ్చి పూర్ణను అనుభవిస్తుంటాడు. బాత్రూంలో స్నానం చేస్తుండగా అక్కడికి కూడా వస్తాడు. అలా ఆమెకు చుక్కలు చూపిస్తాడు. సినిమా అయిపోయాక కూడా ఇంట్లో బాత్ చేస్తున్నప్పుడు దయ్యం వచ్చిందేమో.. నా వెనుక ఎవరైనా ఉన్నారేమో అని ఫీలింగ్ కలిగేదని పూర్ణ చెప్పుకొచ్చింది.
Read Also : Vijaya Devarakonda : విజయ్ దేవరకొండకు బాలీవుడ్ హీరోయిన్ ఫిదా.. రౌడీబాయ్‌తో అలా చేయాలంటూ హాట్ కామెంట్స్..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world