ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, పాగల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షుకుల గుండెల్లో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో విశ్వక్ సేన్. అయితే తాజాగా ఆయన నటించిన చిత్రం ఆశోక వనంలో అర్జున కళ్యాణం గురించి పలు ఆసక్తికర విషయాలను అబిమానులతో పంచుకున్నారు. పెళ్లి కోసం ఎదురుచూసే ఓ 30 ఏళ్ల వ్యక్తి ఎదుర్కునే ఇబ్బందులను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్ విద్యాసాగర్ చింతా. అయితే ఈ సినిమా మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Advertisement
అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతూ… రియల్ లైఫ్ లో కూడా తనకొక బ్రేకప్ స్టోరీ ఉందనే విషయాన్ని తెలిపారు హీరో విశ్వక్ సేన్. మూడేళ్లు ఓ అమ్మాయిని ప్రేమించా.. కానీ ఆమె నాకు బ్రేకప్ చెప్పింది. కారణం ఏంటో కూడా తెలియదు.. ఆమె నన్ను వదిలేసిన విషయం కూడా నెల రోజుల తర్వాతే నాకు తెలిసిందంటూ విశ్వక్ సేన్ వివరించాడు.
Advertisement
Advertisement