...

Aadhi pinishetty: పెళ్లి బంధంతో ఒక్కటైన ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ

Aadhi pinishetty: హీరో పాత్రలు, సైడ్ పాత్రలతో మంచి గుర్తింపు పొందిన నటుడు ఆది పినిశెట్టి. ఒక వి చిత్రం, గుండెళ్లో గోదారి, సరైనోడు, రంగస్థలం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఆది పినిశెట్టి ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. కన్నడ హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆయన వివాహం బుధవారం చెన్నైలో ఘనంగా జరిగింది.

కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నాని, సందీప్ కిషన్ తదితరులు సంగీత్ లో సందడి చేశారు. ఆది పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి ఫోటోలు చూసిన సినీ అభిమానులు వారిద్దరికీ వివాహ వేడుక శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఆది-నిక్కీ పలు తమిళ చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలతో వారిద్దరి మధ్య స్నేహ బంధం మొదలైంది. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. నెల రోజుల క్రితం బంధువుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సంగీత్ వేడుకలో నాని, సందీప్ కిషన్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మిత్రుడి వివాహ వేడుకలో వారిద్దరు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలకు డ్యాన్సులు చేస్తూ అలరించారు. అతి కొద్ది మంది మాత్రమే హాజరైన ఇఈ పెళ్లి వేడుకలో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ బంధువులతో పాటు మిత్రులు కూడా పాల్గొన్నారు. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోల్లో, వీడియోల్లో సినీ ఇండస్ట్రీకి చెందిన కేవలం వీరిద్దరు మాత్రమే పాల్గొన్నారు.