Natural Star Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. చాలా రోజుల తరువాత ఓ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాని. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి , కృతి శెట్టి ఈ సినిమాలో నానికి జోడీగా నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పొందారు.
కాగా నాని ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో ఒకటి… ” అంటే సుందరానికీ ” మూవీ. ఈ సినిమా షూటింగ్ షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తుంది. అలానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో నాని మరోసారి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించునున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.
సినిమా కోసం మొదటిసారి తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడు. దసరా’ చిత్రాన్ని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. నాని ఇందులో ఒక గజదొంగగా కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని సెట్స్ ని నిర్మించనున్నారట. పది ఎకరాల్లో ఓ భారీ విలేజ్ సెట్ ను వేస్తున్నారట… ఈ ఒక్క సెట్ కోసమే దాదాపు పన్నెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్. గతంలో నాని నటించిన వి.. జెంటిల్మెన్ సినిమాలలో నెగిటివ్ షెడ్స్ పాత్రలలో నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.
Read Also : Health Tips : గుడ్డును అలా తినడం కన్నా ఇలా చేస్తేనే బెటర్ అని తెలుసా …
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.