Petrol Prices Today : స్థిరంగా ఇంధన ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Petrol Prices Today
Handle fuel nozzle to refuel. Vehicle fueling facility.

Petrol Prices Today : మన దేశంలో ఇంధన ధరలు చాలా రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది కాలం క్రితం దాదాపు 18 సార్లు ఇంధన ధరలను పెంచుకుంటూ వచ్చిన చమురు సంస్థలు పెట్రో బాదుడుకు గత కొంత కాలంగా విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఉప శమనం లభించింది. దాదాపు 15 రోజులుగా చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పాకిస్థాన్, శ్రీలంకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. శ్రీలంకలో అయితే లీటర్ పెట్రోల్ ధర 338 రూపాయలకు చేరుకుంది. అయితే ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

Petrol Prices Today
Petrol Prices Today
  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.
  • గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది.

Advertisement