Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

AP Inter Exams Dates : ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఏయే తేదీల్లో ఎప్పుడంటే?

AP Inter Exams Dates : ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ రిలీజ్ అయింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మే 2 నుంచి మే 13 వరకు 10వ తరగతి, ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇక మార్చిలో 11 నుంచి మార్చి 31 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరుగుతాయని వెల్లడించారు. 10వ తరగతి ... Read more

By Vinod Kumar

Published on: February 10, 2022 11:46 PM

Updated on: February 10, 2022 11:46 PM

ap-inter-exams-date-ap-10th-and-inter-exams-date-schedule-released-today-check-dates-and-times

---Advertisement---

AP Inter Exams Dates : ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ రిలీజ్ అయింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మే 2 నుంచి మే 13 వరకు 10వ తరగతి, ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

ఇక మార్చిలో 11 నుంచి మార్చి 31 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ జరుగుతాయని వెల్లడించారు. 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగనున్నాయి. అలాగే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ పరీక్షలు జరుగనున్నాయి.

ఏపీ రాష్ట్రంలో మొత్తంగా 6,39,888 మంది విద్యార్థులు 10 తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

10వ తరగతి షెడ్యూల్ (AP 10th Exams Date Schedule) :

మే 02 (సోమవారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (First Language)

మే 04 (బుధవారం ) : సెకండ్‌ లాంగ్వేజ్ (Second Language)

మే 05 (గురువారం) : ఇంగ్లీష్‌ (Enlish Language)

మే 07 (శనివారం) : గణితం (Maths)

మే 09 (సోమవారం) : ఫిజికల్ సైన్స్ (Physical Science)

మే 10 (మంగళవారం) : బయోలాజికల్ సైన్స్ (Biological Science)

మే 11 (బుధవారం) : సోషల్ స్టడీస్ (Social Studies)

మే 12 (గురువారం) : ఫస్ట్‌ లాంగ్వేజ్ పేపర్‌ 2 (కాంపోజిట్ కోర్స్‌/OSSCNEN లాంగ్వేజ్) పేపర్‌ 1 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్)

మే 13(శుక్రవారం) OSSCNEN లాంగ్వేజ్ పేపర్‌ 2(సంస్కృతం, అరబిక్‌, పర్షియన్)/ SSC ఒకేషనల్‌ కోర్స్‌ థియరీ.

Read Also : Karthika Deepam Feb 10 Episode : సూపర్ క్లైమాక్స్.. సౌందర్య ఎంట్రీతో రుద్రాణికి చెక్..! మండిపోతున్న మోనిత..!

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.