Holi Festival: మన భారతదేశంలో జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. హోలీ పండుగను ప్రతి ఏడాది పాల్గుణ మాసంలో పౌర్ణమి ముందు జరుపుకుంటారు. ఇలా ప్రతి ఏడాది హోలీ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. పూర్వకాలంలో హోలీ పండుగ రోజు అందరూ రంగు రంగు పుష్పాలను ఒకరిపై మరొకరు చల్లుతూ ఈ పండుగను జరుపుకునేవారు. అయితే ప్రస్తుతం ఈ పండుగను రంగులతో, రంగు నీటితో జరుపుకుంటున్నారు. అయితే హోలీ పండుగ ఇలా జరుపుకోవడానికి వెనుక కారణం ఏమిటి ఈ పండుగ ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం…
పురాణాల ప్రకారం హోలీ పండుగను సత్య యుగం నాటి నుంచి జరుపుకున్నట్లు తెలుస్తోంది. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అనే విషయం మనకు తెలిసిందే. అది నచ్చని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో మార్గాలు వేతుకుతాడు. ఇలా తనని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన విష్ణు మాయ వల్ల ప్రహ్లాదుడు బతుకుతాడు. ఇక హిరణ్యకశిపుడు చివరికి తన సోదరి హోలిక సహాయంతో ప్రహ్లాదుడిని చితిమంటలలో వేయాలని భావిస్తాడు.
ఈ విధంగా హోలిక ప్రహ్లాదుడు తన ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నికి ఆహుతి అవుతుంది. విష్ణుదేవుడి మాయవల్ల ప్రహ్లాదుడు ఆ మంట నుంచి బయట పడగా హోలిక మాత్రం అగ్నిలో ఆహుతి అవుతుంది. ఇలా అప్పటి నుంచి పెద్ద ఎత్తున హోలీ పండుగను జరుపుకోవడం మొదలుపెట్టారు. అయితే కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ హోలీ పండుగ రోజు సాయంత్రం హోళికా దహనం చేస్తారు. ఇక ఈ ఏడాది ఈ పండుగ మార్చి 18వ తేదీ వచ్చింది.పూర్వం హోలీ పండుగ రోజు ప్రతి ఒక్కరు రంగు పుష్పాలను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఈ పండుగను జరుపుకునేవారు. ఇలా చేయడం వల్ల అందరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని భావిస్తున్నారు.