
Ulavacharu Biryani recipe Making Restaurant Style at Home, Follow These Steps
Ulavacharu Biryani : బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు.. బిర్యానీ ప్రియుల్లో నోట్లో లాలాజలం ఊరిపోతుంటుంది. అనేక రకాల బిర్యానీలను తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకూ మీరు చూసిన బిర్యానీల్లో ఉలవచారు బిర్యానీని ఎప్పుడైనా తిన్నారా? అయితే ఓసారి ఉలవచారు బిర్యానీ ట్రై చేయండి.. ఒకసారి తిన్నారంటే.. వదిలిపెట్టకుండా ఖాళీ చేసేస్తారు. మరి.. ఈ ఉలవచారు బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసా?
కావలసిన పదార్ధాలు :
బాస్మతి రైస్ , ఉడికించి పెట్టుకున్న ఉలవచారు , చికెన్, పెరుగు, నూనె, ఉల్లిపాయలు, కొత్తిమీర,పుదీనా, నిమ్మకాయ, పచ్చిమిర్చి, నెయ్యి, కారం, ఉప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, బిర్యాని ఆకు, షాజీరా, సొంపు, మరాటి మొగ్గ,
Ulavacharu Biryani : ఉలవచారు బిర్యానీ తయారీ విధానం ఇలా..
ఒక చిన్న పెనంలో యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క , జాజికాయ, జాపత్రి, బిర్యానీ పూలు ,షాజీరా ,సోంపు మరాటి మొగ్గను వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేయాలి. ఆ తరువాత పెద్ద మిక్సింగ్ బౌల్‌లో పసుపు కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, పెరుగు,నూనె , నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మరసం, చికెన్ ముక్కలను కలిసి మసాలాగా తయారుచేసుకోవాలి.
ఇప్పుడా మిశ్రమం అంతా ముక్కలకు బాగా పట్టేలా కలిపి ఒక గంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత గిన్నెలోకి బియ్యం తీసుకుని అరగంట సేపు నానబెట్టాలి. ఆ తర్వాత బిర్యాని వండే పాత్రలో అడుగున కొద్దిగా నూనె పోసి మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేసి మూతపెట్టి 15 నిమిషాలు పాటు ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత కొద్దిపాటి ఫ్లేమ్‌కు తగ్గించాలి. మరొక పాత్రలో దాదాపు 3 లీటర్ల నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఆ నీళ్లలో గరం మసాలా దినుసులు, పుదీనా ఆకులు, ఉప్పు, నూనె, కలిపి మరగనివ్వాలి.
నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యంలో కలపాలి. 3 నిమిషాల తర్వాత వెంటనే నీటిని వార్చి పారబోయాలి. అంతకు ముందు చికెన్ మీద పెట్టుకున్న మూతను తీసి ఉడుకుతున్న కూరలో వేరుచేసి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఉలవలను ఉడికించి చారు లాగా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్, సగం ఉడికిన అన్నం మీద వేసి బాగా కలపాలి. మరికొంతసేపు ఉడికుంచుకొని తర్వాత దాని మీద పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయలు, వేసి మంటను తగ్గించి 5 నిమిషాలపాటు ఉడికించాలి .ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అలా 30 నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇంకేముంది వేడి వేడి ఉలవచారు బిర్యాని రెడీ అయినట్టే.
Read Also : Diesel pond: ఆ గ్రామంలో డీజిల్ చెరువు.. ఎంత తోడినా ఇంకా వస్తూనే ఉందట!