Shruti Haasan Beauty Tips : అందాల భామ శృతిహాసన్.. తన బ్యూటీ వెనుక అసలు సీక్రెట్ రివీల్ చేసింది. తన ముఖం అందంగా మెరిసిపోవడానికి తాను రోజు ఏం చేస్తుందో రహాస్యం బయటపెట్టేసింది. అందరి వంటింట్లో దొరికే వాటితోనే తన ముఖాన్ని అందంగా చేసుకోవచ్చునని అంటోంది ఈ బ్యూటీ. తన అందానికి ముఖ్యంగా ఎలాంటి పదార్థాలను వాడిందో ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చింది. అందంతో పాటు తన ఫిట్ నెస్ సీక్రెట్స్ కూడా చాలా విషయాలను శృతి పంచుకుంది. తన ముఖం అందానికి ఏయే పదార్థాలను వాడిందో చెప్పింది.. అవేంటో ఓసారి చూద్దాం.. వంటసోడా తీసుకోని అందులో కొంచెం కొబ్బరి నూనె కలపాలని తెలిపింది. అలాగే 2, 3 రోజులకు ఒకసారి ఇలా ఈ మిశ్రమాన్ని స్ర్కబ్ చేస్తానని అంటోంది.
అంతేకాదు.. పెరుగు, తేనెను సమపాలల్లో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అలా 15 నిమిషాల పాటు అలానే ముఖంపై ఆరాలి. ఆ తర్వాత కడిగితే ముఖం అద్దంలా మెరిసిపోతుందని చెబుతోంది. మరో చిట్కా కూడా పాటిస్తుందట… రెండు స్ట్రాబెర్రీలను మొత్తగా గుజ్జులా చేయాలట.. రెండు చెంచాల తేనె స్ట్రాబెర్రీల పేస్టులో కలపాలి. ఈ అద్భుతమైన మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. దాదాపు 10 నిమిషాలు అలానే ఉంచుకోవాలి.
ఆ తర్వాత స్వచ్ఛమైన నీటితో ముఖాన్ని కడిగేయాలి. అంతే.. ముఖం అందంగా మెరవడం ఖాయమంటోంది శృతిహాసన్.. తన ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుండా అందంగా మేకప్ లేకపోయినా నేచురల్ గా కనిపించడానికి ఇదే సీక్రెట్ అంటోంది.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా శృతిహాసన్ చెప్పిన ఈ బ్యూటీ సీక్రెట్ ఓసారి ట్రై చేసి చూడండి.. అందమైన ముఖం కోసం ఇలాంటి మరెన్నో బెస్ట్ టిప్స్ తెలుసుకోవచ్చు.
శృతిహాసన్ ఇంకా ఏం చెప్పిందంటే..
జుట్టుకు కొబ్బరి నూనె, ముఖానికి సహజమైన మాస్క్‌లు వేసుకుంటాను. ప్రతిఒక్కరి చర్మానికి ఈ రెమెడీ సరిపోతుందో లేదో నాకు తెలియదు. కానీ, ఇది నాకు అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. అంటే, నేను కొబ్బరి నూనె, బేకింగ్ సోడాను మిక్స్ చేసి ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగిస్తాను’ అని బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. కొబ్బరి నూనె జుట్టుకు మాత్రమే కాదు.. చర్మానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ చర్మాన్ని అందంగా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చర్మానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కూడా ముఖాన్ని మృదువుగా చేయడంలో సాయపడుతుంది. చర్మంపై ఎరుపు, చర్మపు ముడతలు, చర్మంపై మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి కొబ్బరినూనె మంచి ఔషధంగా పనిచేస్తుందని తెలిపింది.
బేకింగ్ సోడా గురించి చెప్పాలంటే..
మొటిమలకు ఇది ‘రామ్ బాణం లాంటిదని అంటోంది. శృతి చేసినట్లే కొబ్బరినూనెతో మిక్స్ చేయండి. నీళ్లతో మిక్స్ చేసి స్క్రబ్‌గా అప్లై చేసుకోవచ్చు. మొటిమల మచ్చలను కలిగించే బ్యాక్టీరియాతో ఇది పోరాడుతుంది. బేకింగ్ సోడాలో యాంటీ బాక్టీరియల్ గుణాలు చాలా ఉన్నాయి. చర్మాన్ని అందంగా ఉంచడంలో సాయపడుతుంది.
Read Also : Green KumKum Laxmi : ఆకుపచ్చ కుంకుమతో అదృష్టం వరిస్తుందా..? ఇంట్లో డబ్బుల గలగలేనా..?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world