Lemon side effects: Lemon side effectsవేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మంది తరచుగా నిమ్మరసం తాగుతుంటారు. ఇందులో ఉండే యాసిడ్ ఆమ్లాలు మన కడుపులో ఉన్న హానీ చేసే క్రిములను చంపేస్తాయి. అలాగే ఇందులో ఉండే విటామిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సాయపడుతుంది. ఇన్ని హెల్త్ బెనిపిట్స్ ఉన్న నిమ్మకాయ కూడా మనకు హానీ చేస్తుంది. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల గొంతు నొప్పితో పాటు హార్ట్ బర్నింగ్, ఛాతి నొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నిమ్మ లేదా సట్రస్ పండ్లను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో అవసరమైన వాటి కంటే ఐరన్ నిల్వలు ఎక్కువవుతాయి.
దీంతో ఐరన్ ఓవర్ లోడ్ లేదా హెమో క్రోమాటోసిస్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. నిమ్మ రసాన్ని మోతాదుకు మించి తాగడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. నిమ్మరసంలో టైరామిన్ అనే అమినో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మొదడుకు ఒక్కసారిగా బ్లడ్ ఫ్లోను పెంచుతుంది. దీంతో తలనొప్పి, క్రోననిక్ టెన్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది. నిమ్మరసం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి. నిమ్మలో ఉండే సిట్రస్ యాసిడ్ వల్ల పళ్ల ఎనామినల్ దెబ్బ తీస్తుంది. అందుకే దేనిని కూడా అతిగా తీసుకోవద్దు. అహారం లిమిట్ లో తింటేనే ఆరోగ్యం బాగవుతుంది. కానీ మోతాదుకు తింటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.