Uses of clove oil : భారతీయ వంట గదుల్లో కచ్చితంగా లవంగాలు ఉంటాయి. అలాగే లవంగం నూనె కూడా చాలా ఇళ్లలో ఉండే ఉంటుంది. అద్భుతమైన ఔషధ గుణాలు కల్గిన ఈ సుగంధ ద్రవ్యం… అనేక రకాల వ్యాధులను నయం చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. లవంగం శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా శరీరంలోని బలహీనతను దూరం చేస్తుంది. అలాగే జీర్ణ శక్తిని పెంచి అజీర్తిని తగ్గిస్తుంది. ఈ రోజుల్లో పురుషులు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారు లవంగం నూనెను వాడచం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే పురుషులకు లవంగం నూనె ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Uses of clove oil
లవంగం నూనెలో ఉండే ఫ్లేవనాయిడ్లు, యూజినాల్ అనేవి పురుషషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షణను ఇస్తాయి. అలాగే ఎలాంటి మత్తునైనా లవంగం వదిలిస్తుంది. మీరు సిగరెట్ లేదా మద్యం అలవాటును వదిలించుకోవాలంటే వేడి నీటిలో లవంగం వేసి స్నానం చేయాలి. లవంగంతో ఎలాంటి చెడు వ్యసనం అయినా వదిలించుకోవచ్చు. ఈ నూనెను వేడి చేసి వాడటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీని కారణంగా శరీరంలో వేడి ఉంటుంది. దీని కారణంగా ఒత్తిడి దూరం అవుతుంది.
లవంగాల్లో విటామిన్లు, కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. మీరు లవంగం నూనెను ఉపయోగిస్తే దాన్ని మీ గదిలో స్ప్రే చేయవచ్చు. దీని సువాసన మీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగం నూనెను కూడా ఉపయోగిస్తారు. ఇది మీ మానసిక ఆరోగ్యంతో పాటు అనేక ఇతర సమస్యలను దూరం చేస్తుంది. దంతాల సమస్యను తొలగించడానికి లవంగం నూనెను ఉపయోగించవచ్చు.
Nela vakudu chettu : నేల వాకుడు మొక్క.. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తుంది తెలుసా?