Parents Beware : పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులదేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు కొంత మేరకు అయినా విచక్షణా జ్ఞానం వచ్చేంత వరకు కంపల్సరీగా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే వారు ఏదేని విషయమై బయటకు వెళ్లి లేనిపోని ఇబ్బందులలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
అటువంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఓ ఆరేళ్ల బాలుడు పేరెంట్స్‌కు చెప్పకుండా ఐదు అంతస్తుల బిల్డిండ్ ఎక్కి అక్కడ గాలిపటం ఎగరేస్తూ.. కాలు జారి కిందపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు తమ పిల్లలపైన శ్రద్ధ వహించాలని పోలీసులు, స్థానికులు సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు తమ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయినప్పటికీ అప్పుడుప్పుడు తమ పిల్లలపైన ఫోకస్ పెడుతుండాలని, వారిని అలక్ష్య పెట్టొద్దని అంటున్నారు పెద్దలు. గుజరాత్‌లో జరిగిన గాలిపటం దుర్మరణం విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కూడా.
తల్లిదండ్రులకు తెలియకుండా సదరు బాలుడు గాలిపటం ఎగరేయడానికి బిల్డింగ్ ఎక్కినట్లు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు తేల్చారు. గుజరాత్‌లో ప్రతీ ఏడాది ఇలా గాలి పటం ఉత్సవాల్లో ఏదో ఒక విషాదం జరుగుతున్నదని పోలీసులు చెప్తున్నారు. గాలి పటం ఎగరేస్తూ ఇది వరకు చాలా సార్లు ఇటువంటి ఘటనలు జరిగాయని, గాలి పటాలకు వినియోగించే మాంఝా కారణంగానూ చాలా మంది గాయపడ్డారని పోలీసులు వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పిల్లలు సంతోషంగా గడుపుతున్నారని అలా ఊరికే వదిలేయద్దని, వారిని సంతోషంగా ఉంచుతూనే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి దుర్ఘటనలు జరిగిన తర్వాత అందరికంటే ఎక్కువగా బాధపడేది తల్లిదండ్రులే కాబట్టి.. వారే ముందు ఇటువంటి జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
Read Also : Actress Sneha : స్నేహకు చేదు అనుభవం.. అందరి ముందు హీరోయిన్ నడుం గిల్లిన వ్యక్తి.. ఎవరంటే?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world