Garuda mukku: ప్రకృతికి మనిషికి మధ్య విడదీయరాన బంధం ఉంది. ముఖ్యంగా మొక్కలు మనిషికి అత్యంత మేలు చేస్తాయి. ఎన్నో ఔషధ మొక్కలు.. వేరు, కాండం, ఆకులు, పువ్వులు ఇలా మొక్కలోని ప్రతీ ఒక్క పార్ట్ మానవాళికి ఏదో ిఘంహా మేలు చేస్తుంటుంది. అలాంటి మొక్కల్లో ఒకటే గరుడ ముక్కు మొక్క. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటాయి. దక్షిణ భఆరత దేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపించే ఈ మొక్కను గిరిజనులు అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అయితే ఈ చెట్టులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు వ్యాఖ్యానిస్తుంటారు. ఈరోజు గరుడ ముక్కు మొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
మూర్చ వ్యాధి రోగులకు గరుడ ముక్క మక్క ఆకుల రసం మంచి మెడిసిన్ గా పనిచేస్తుందట. ఈ మొక్కల రసం నిద్రలేమికి, క్షయ నివారణకు ఉపయోగిస్తారు. తేలు విషాన్ని హరించడంలో ఈ ఆకుల రసం దివ్య ఔషధం. తేలు కరిచిన చోట ఈ ఆకుల రసాన్ని వేసి కట్టుకడితే వెంటనే ఉపశమనం కల్గుతుంది. కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే… పండ్లను కాల్చిన బూడిద, కొబ్బరి నూనెతో కలిపి ఆ మిశఅరమాన్ని కాలిన గాయాలపై అప్లై చేయాలి. ఈ మొక్క ఆకుల రసాన్ని మెడకు రాయడం వల్ల క్షయ వ్యాధి తగ్గు ముఖం పడుతుంది.